IIT Madras students make hilarious parody of ‘Call me Maybe’ video song on arrange marriage, goes viral

Hilarious video by iit madras students on marriage proposals

arrange marriage, Call me maybe, Saahitya 2016, Video parody, IIT Madras, Carly Rae Jepsen, Call Me Maybe, Be Our Pondati, parody, viral video

The parody of the song is based on the traditional matrimonial sites in which a mother looks for an authentic cultural 'Pondati' (Wife in Tamil).

ITEMVIDEOS: నెట్టింట్లో సంచలనం చేస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల పేరడీ పాట..

Posted: 04/16/2016 05:19 PM IST
Hilarious video by iit madras students on marriage proposals

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునేందుకు తాము సుముఖంగా లేమని చెబుతున్నారో.. లేక ఈ పెళ్లిళ్లకు తాము విముఖతను ప్రదర్శించడం లేదని ప్రకటిస్తున్నారో తెలియదు కానీ.. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన  పేరడీ అరేంజ్డ్ మ్యారేజీ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో  వైరల్ అయింది. అయితే తమను బాధించే అంశం మాత్రం ఒక్కటని, అదే అత్తగారి తరపు వారు అమ్మాయిని చూసి చేసే కామెంట్లకు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పకనే చెబుతున్నారు మద్రాస్ ఐఐటీ విద్యార్థులు.

అదెలా అంటే అంత అర్థమెచ్చాలా వారు రాసి పాడిన పాట ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. తమ కుటుంబంలోకి  కోడలుగా  రావాల్సిన అమ్మాయికి  ఉండాల్సిన గుణగణాలను ఏకరువు పెడుతూ,వ్యంగ్యంగా  సాగే వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. 12 అంతర్జాతీయ అవార్డులతో, 2012 లో సంచలనం సృష్టించిన కార్లే రే జెప్సన్  ఆల్బం  'కిస్ ' లోని కాల్ మీ మే బీ  పాటకు పేరడీగా  ఐఐటి విద్యార్థినిలు  కృపా వర్గీస్, అనుక్రిపా  ఎలాంగో అస్మిత ఘోష్  ఈ వీడియో ను చిత్రీకరించారు.

'బీ అవర్ పొందాటి(భార్య)' మే బి కాల్ మీ అంటూ   పాటలా సాగే వీడియో ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. 2016 ఏడాదికి  సాహిత్య అవార్డు లోని  పేరడీ  కాంటెస్ట్ విభాగం ఎంట్రీకోసం  మద్రాస్ ఐఐటికీ  కృపా వర్గేసీ  ఈ వీడియో రూపొందించారు.   సగటు భారతీయ  కుటుంబాల్లో  కోడలికి కావాల్సిన అర్హతలు, ఉండకూడని లక్షణాల గురించి ఏకరువు పెడుతూ  సాగే ఈ వీడియో  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావాల్సిన వధువు కోసం పెద్ద చిట్టానే విప్పింది. అంతేకాక తమ కుటుంబానికి చెందిన వివరాలను, సాంబారు, వడ తయారు చేసే నైపుణ్యం తదితరాలను ఆశువుగా వెల్లడించింది.   ఏప్రిల్ 4 యూ  ట్యూబ్  లో పోస్ట్  అయిన ఈ వీడియో  ఫీవర్ అనంతరం సోషల్ మీడియాకు పాకింది. ఇప్పటికే  రెండులక్షలకు పైగా లైక్ లను కామెంట్లను సొంతం  చేసుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles