Powerful magnitude 7.8 earthquake strikes Ecuador, tsunami warning dropped

Deadly 7 8 magnitude earthquake devastates ecuador

Ecuador,Ecuador earthquake,USGS,7.8 Earthquake in Ecuador, Ecuador Tsunami, Magnitude 7.8 earthquake, Tsunami alert, Quito

At least 77 people were killed and hundreds injured by the powerful 7.8 magnitude earthquake that struck the Pacific coastline late on Saturday, Ecuador's vice president said.

ఈక్వెడార్ లో భారీ భూకంపం.. 77 మంది మృతి

Posted: 04/17/2016 02:02 PM IST
Deadly 7 8 magnitude earthquake devastates ecuador

ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప ధాటికి 77 మంది మృతిచెందగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూకంపంలో క్షతగాత్రులైన వారిని స్థానిక అస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ఇక శిధిలాల మధ్య చిక్కకున్న వారి కోసం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య 77 కి పెరిగినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్‌ గ్లాస్‌ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు వున్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేశామని, అయితే సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన ప్రజలకు విన్నవించారు.

కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకపం కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్‌ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles