realtor | arrest | film actress | kr vijaya | daughter | Hemalatha | harassment | Kathirvel | Atrocities against Women's Act

Realtor held for harassing film actress daughter

realtor, realtor arrest, real estate businessman arrest, realtor harassing film actress daughter, realtor arrested for harassing veteran actress kr vijaya daughter, realtor harassment, kr vijaya, daughter, Hemalatha, Kathirvel, harassment, realtor Kathirvel arrest, Atrocities against Women's Act

A real estate businessman has been arrested for allegedly harassing the daughter of veteran South Indian film actress, K R Vijaya,

సీనియర్ నటి కుమార్తెను వేధించిన రియల్టర్ అరెస్టు

Posted: 04/20/2016 07:21 AM IST
Realtor held for harassing film actress daughter

ప్రముఖ సీనియర్ నటి కుమార్తెను పెళ్లి చేసుకొమ్మని వేధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎట్టకేలకు కటకటాలపాలయ్యారు. నటి కుమార్తె భర్తతో విడిపోయి ఒంటరిగా వుంటుందని, అమె కుమార్తెలు కూడా విదేశాలలో వుంటున్నారని సమాచారం అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వివాహం చేసుకోవాలని పదే పదే వేధింపులకు పాల్పడుతూ, బెదింపులకు కూడా దిగడంతో అమె ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేను నమోదు చేసుకుని రియల్టర్ ను అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సీనియర్ నటి కేఆర్ విజయ కుమార్తె హేమలత(47) కోవై అవినాశిరోడ్డు లక్ష్మిమిల్ జంక్షన్ సమీపంలోని అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. అభిప్రాయబేధాల కారణంగా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారు ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్నారు. హేమలత సెల్‌ఫోన్‌కు పాపనాయగన్ పాళయంకు చెందిన కదిరవేల్(45) అనే అతడు ఫోన్‌చేసి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినని అని, స్థలం కొనాలంటే తనను సంప్రదించవచ్చునని పరిచయం చేసుకున్నాడు.

ఆ తరువాత స్థలానికి సంబంధించి మాట్లాడడానికి కదిరవేల్ హేమలత ఇంటికి వచ్చాడు. హేమలత ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరారు. ఆ తరువాత అమెతో తరచూ ఫోన్ ద్వారా మాట్లాడేవాడు. హేమలతకు తరచూ సెల్‌ఫోన్‌లో మెసేజ్ పంపేవాడు. వీటిని వ్యతిరేకించిన హేమలత కదిరవేల్ కు ఫోన్ లను బ్లాక్ చేయడం ప్రారంభించింది. దీంతో్ రియల్టర్ కదిరవేల్ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తనను ఎలాగైనా వివాహం చేసుకోవాలని లేకపోతే బాగోదని హెచ్చరికలు జారీ చేశాడు. అమె పోలీసులకు పిర్యాదు చేస్తాననడంతో కొన్ని రోజులు సైలెంట్ గా వున్నాడు.

ఆ తరువాత ఇటీవల ఆమెను కలుసుకున్న కదిర్‌వేల్ కేఆర్ విజయ కుటుంబంలో ఎవరినైనా వివాహం చేసుకోవాలన్నదే తన చిరకాల వాంఛ అని పేర్కోన్నాడు. హేమలతను కాకపోతే కేఆర్ విజయ సోదరి కుమార్తె అయినా ఫర్వాలేదు తనకు ఇచ్చి పెళ్లి చేయాలని మొండిపట్టుపట్టాడు. ఇందుకోసం తన భార్యకు విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధమని చెప్పాడు. దీంతో హేమలత దిగ్భ్రాంతి చెందింది. దీనిపై కోయంబత్తూరు రేస్‌కోర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళా వేధింపుల నివారణ చట్టం కింద కదిర్‌వేల్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles