హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు | Jobs in Hyderabad NIMS

Jobs in hyderabad nims

Jobs, NIMS, Jobs in NIMS, Job Notification, ఉద్యోగాలు, ఖాళీలు, నిమ్స్

Nizam Institute of Medical Sciences inviting applications from elibgible candidates for staff nurse posts.

JOBS: హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు

Posted: 04/20/2016 11:12 AM IST
Jobs in hyderabad nims

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ స్టాఫ్ నర్స్ ఇంటర్న్‌షిప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టు పేరు: జూనియర్ స్టాఫ్ నర్స్ ఇంటర్న్‌షిప్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఇంటర్‌తోపాటు మూడేండ్ల జనరల్ నర్సింగ్ కోర్స్‌లో ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 6 నెలల మిడ్‌వైఫరీ ట్రైయినింగ్‌ను పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2016 జనవరి 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.1000/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500/-)
దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్/నిమ్స్ క్యాష్ కౌంటర్‌లో చెల్లించాలి
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిమ్స్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్ కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ రిక్రూట్‌మెంట్ అధికారికి పంపాలి.
చిరునామా:
ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిజామ్ ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం,500082.
చివరితేదీ: 2016 ఏప్రిల్ 30
వెబ్‌సైట్: http://www.nims.edu.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles