సమ్మర్ లో కూల్ గా కొడితే అంతే | Beer Not Good for Health in Summer

Beer not good for health in summer

beer, Beer Party, Summer, Heat, బీర్, ఎండాకాలం, ఎండలు, మందు

In India. the Heat and Dust of April-May, bring cheers for the farmers finalizing the wheat crops’ harvesting, thrashing and transporting. For the urban citizens, the sizzling heat brings fatigue, dizziness, hypotension, heat exhaustion and heatstroke.With the temperature peaking above 40 degrees Celcius and a ‘dry-air’ with minimal humidity of 10-20 percent, the coping systems of body are under strain.

సమ్మర్ లో కూల్ గా కొడితే అంతే

Posted: 04/21/2016 10:00 AM IST
Beer not good for health in summer

మంట పుట్టే వేడి రోజుల్లో చల్లచల్లటి బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అనటం చాలామంది దగ్గర వింటుంటాం. కానీ.. ఆ మాటల్లో నిజం ఎంతన్నది ప్రశ్న. మాటలు చెప్పుకోవటానికి శాస్త్రీయతకు మధ్యనున్న తేడా బీరు విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మండే ఎండ ఉన్న వేళ కూల్ బీర్ తాగితే రిలీఫ్ ఎక్కువన్న మాట ఉత్తదేనని నిపుణులు చెబుతుంటారు. ఎందుకిలా అంటే.. వారు సుదీర్ఘ వివరణ ఇస్తారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బీర్ తాగటం అంటే సమస్యను ‘‘కొని’’ తెచ్చుకున్నట్లే. ఎందుకంటే.. బీర్ మొదలు ఏ ఆల్కాహాల్ అయినా శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుందన్నది చేదు నిజం. దీనికి నిదర్శనం ఏమిటంటే.. ఆల్కాహాల్ తాగిన వారు తరచూ యూరినస్ కు వెళ్లటమే. ఇలా తరచూ బాత్రూంకి వెళ్లటం కారణంగా డీహైడ్రేషన్ కు గురి కావటం ఖాయమని చెబుతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువగా బీర్లు తాగుతుంటారు. స్నేహితులతో కూర్చొని మాటలు చెబుతూ బీర్లు లాగించేస్తుంటారు. ఇలా చేయటం కారణంగా శరీరంలోని నీరు.. సోడియం.. పోటాషియం  అన్నీ బయటకు వెళ్లిపోతుంటారు. చెమట కారణంగా మరింత నీరు బయటకు వచ్చేస్తుంది. అన్ని కలిసి డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. అందుకే.. ఎండాకాలంలో కూల్..కూల్ బీర్లు మాత్రమే కాదు.. అల్కాహాల్ కంటెంట్ ఉన్న ఏ ద్రవపదార్థాన్ని తాగటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer  Beer Party  Summer  Heat  బీర్  ఎండాకాలం  ఎండలు  మందు  

Other Articles