108-Year-Old Message in a Bottle Is Oldest Ever Found

Century old message in a bottle makes guiness world records

Germany, message in a bottle, North Frisian Islands, Marine Biological Association, Amrum, Guinness World Records,Plymouth,Germany,UK news,Europe,World news,Science

A message in a bottle discovered by a German tourist has achieved a world record. The discovery also came with a monetary reward, albeit one of symbolic value after a century of inflation.

ITEMVIDEOS: శివమణి తరహాలో సీసా సందేశం.. పురాతన సందేశాంగా గెన్నిస్ రికార్డు..

Posted: 04/23/2016 01:46 PM IST
Century old message in a bottle makes guiness world records

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శివమణి గుర్తుందా..? చిత్రం సూపర్ హిట్ కావడానికి కారణమైన కీలకమైన పాయింట్ సీసా తెచ్చిన సందేశం. అచ్చంగా అలానే అనేక ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి, ఎంతో మంది తాము నడిసంధ్రంలో గమ్యం తెలియని సమయాల్లో, అపదల్లో చిక్కుకున్న సందర్భాల్లో తమను ఎవరైనా అదుకునేందుకు వీలుగా సీసాలో తమ సందేశాన్ని రాసి పంపించిన ఘటనలు అనేకంగా నమోదయ్యాయి.

అయితే మాత్రం ఈ టాపిక్ ఇప్పుడెందుకు అంటారా..? తాజాగా అలాంటి సీసా సందేశమే గెన్నిస్ రికార్డును సాధించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 108 ఏళ్ల పాటు సముద్రంలో ఒక సందేశాన్ని తీసుకుని ప్రయాణించిన ఓ బాటిల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్ బయెలాజికల్ ఆసోసియేషన్ (ఎన్‌బీఏ) ప్రతినిధులు ఓ ఖాళీ సీసాలో ఉత్తరాన్ని ఉంచి సముద్రంలోకి విసిరివేశారు.

అప్పటి నుంచి సముద్రంలో ప్రయాణించిన ఆ బాటిల్.. 2015లో జర్మనీలోని అమురమ్ దీవుల్లో మరియన్నే వింక్లర్ అనే  ఆవిడ కంటపడింది. బాటిల్‌ను తెరిచి చూసిన ఆమెకు అందులోని ఉత్తరంపై వున్న ఎన్‌బీఏ అడ్రస్‌ ను చూసి వారికి తిరిగి ఆ ఉత్తరాన్ని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తరం వెనుక రాసివున్న సూచన కనబడటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరియాన్నే బాటిల్ దొరికిన ప్రదేశం తదితర వివరాల్ని నింపి ఎన్‌బీఏకు పంపించింది. ఈ ఉదంతాన్ని గిన్నిస్ ప్రతినిధులు గుర్తించి ‘బాటిల్‌లో అతి ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా గుర్తింపునిచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles