Mustafizur, Warner lead Sunrisers past Punjab

Mustafizur warner hand sunrisers comfortable win

indian premier league, ipl 2016, ipl 9, Sunrisers Hyderabad, Kings Punjab, david warner, Mustafizur Rahman, sun risers hyderabad bowler, Mustafizur Rahman economical figure, Mustafizur Rahman ipl record, cricket news, ipl news, cricket

Mustafizur Rahman and David Warner produced clinical performances to pave the way for Sunrisers Hyderabad's thumping five-wicket win against Kings XI punjab

హ్యాట్రిక్ విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్

Posted: 04/24/2016 12:59 PM IST
Mustafizur warner hand sunrisers comfortable win

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి నిరాశ పరిచిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత రాటుదేలుతోంది. సొంతగడ్డపై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన రైజర్స్‌ టోర్నీలో మరో ఏకపక్ష విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక్కడి ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ ఐదు వికెట్లతో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ మరో 13 బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) వరుసగా మూడో అర్ధ శతకంతో చెలరేగగా, శిఖర్‌ ధవన్‌ (45), ఇయాన్‌ మోర్గాన్‌ (25) సత్తా చాటారు.
            
మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 143 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) జట్టులో టాప్‌ స్కోరర్‌. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1), ఓపెనర్‌ మురళీ విజయ్‌ (2), కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (9) తీవ్రంగా నిరాశ పరిచారు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 36 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగి జట్టుకు గౌరవప్రద స్కోరందించాడు. నిఖిల్‌ నాయక్‌ (22)తో కలిసి ఆరో వికెట్‌కు అతను 50 పరుగులు జోడించాడు. ముస్తాఫిజుర్‌, హెన్రిక్స్‌ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన హైదరాబాద్‌ మొత్తం ఆరు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  ipl 9  Sunrisers Hyderabad  Kings Punjab  david warner  mustafizur rahaman  

Other Articles