Lalu Prasad's elder son Tej Pratap Yadav set to become 'chief minister'

Tej pratap yadav all set to become chief minister of bihar

Tej Pratap Yadav,Lalu Yadav,Bihar chief minister,Tej Pratap movie,Tej Pratap shooting,Bihar kidnappings, Apharan Udyog, Bihar‬, Bihar CM, Apharan Udyog, RJD

RJD chief Lalu Prasad Yadav's elder son and Bihar health minister Tej Pratap will soon become 'chief minister'!

లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు బీహార్ ముఖ్యమంత్రి..?!

Posted: 04/26/2016 08:59 PM IST
Tej pratap yadav all set to become chief minister of bihar

ఆయన బీహార్ అరోగ్య శాఖ మంత్రి, ఆయన తమ్ముడు ఢిప్యూటీ ముఖ్యమంత్రి.. కాలం కలసిరాలేదని ఇన్నాళ్లు అనుకున్నా.. అయన కల నెరవేరింది. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరెవరో కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, అర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ ప్రతాప్ యాదవ్.. బిహార్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన సమస్యను కూడా పరిష్కారం చేశారు, రోడ్డుపై వందల సంఖ్యలో అందోళన చేస్తున్న ప్రజలను శాంతింపజేశారు.

తన ఇద్దరు పుత్రరత్నాల్లో చిన్నకోడుకుకు ఉన్నత పదవి దక్కడం సమంజసమని బీహార్ ఎన్నికల అనంతరం లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాంటిది ఏకంగా తన పెద్ద కుమారుడికి అంతకన్నా పెద్ద పదవిని అందించడంలో అయన అంతర్యమేమిటి..? కొన్ని నెలల వ్యవధిలోనే తేజ్ ప్రతాప్ లో వచ్చిన మార్పేంటి..? అంతలా అయన రాజకీయంగా చేసిన సమాజహిత కార్యక్రమాలు ఏంటి..? ఇప్పుడీ ప్రశ్నలన్ని మీ మదిని తొలుస్తున్నాయి కదూ. అయితే ఇది నిజమేనా..? ఎందుకీ మార్పులు.. మరి ముఖ్యమంత్రి నితీష్ ఎక్కడికెళ్తారు..? వివరాల్లోకి వెళ్లాల్సిందే..

అక్కడ రోడ్డుపై జనం ఆందోళన చేస్తున్నారు. ఇంతలో కుర్తాపైజామా ధరించిన ముఖ్యమంత్రి ఎస్‌యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష వేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆందోళనకారులు శాంతించారు. ఇలా బిహార్ సీఎంగా కనిపించి ఆందోళనకారులను శాంతింపజేసింది తేజ్‌ ప్రతాప్ యాదవ్. ఇదంతా సినిమా కోసమే. 'అపహరణ్‌ ఉద్యోగ్‌' (కిడ్నాప్ ఇండస్ట్రి) పేరిట రూపొందుతున్న ఓ సినిమాలో లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్‌ బిహార్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.

1990లో బిహార్‌లో సంభవించిన కిడ్నాప్‌లు నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో బిహార్ సీఎం లాలూ ఉన్నారు. అంధకారంలో ఉన్న బిహార్‌ను వెలుగులోకి తీసుకొచ్చే చక్కని కథతో రూపొందిన సినిమా కావడంతో తాను నటించానని, ఇందులో ఓ పాత్రలో లాలూ యాదవ్‌ కూడా కనిపిస్తారని షూటింగ్ అనంతరం తేజ్‌ప్రతాప్ తెలిపారు. అయితే విమర్శకులు ఎంతగా విమర్శించినా.. ప్రజల కష్టనష్టాలను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేసినా.. తేజ్ ప్రతాప్ సింగ్ మాత్రం సినిమా షూటింగ్ లకు సమయాన్ని కేటాయిస్తున్నారు, అంతేకాదు షూటింగ్ లేనప్పుడల్లా ఆయన తన ఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles