madhya pradesh cousin misbehaves with sister beaten up by mob

Cousin misbehaves with sister beaten up by mob

misbehaving, Madhya Pradesh, molestation, sexual abuse, Cousin misbehave, Neemuch, beaten, cousin, Girl, eve teasing, misbehaving, mob, attrocities on women, harassment on women, violence on women, misbehaving with women, rape, gangrape, rape on woman, gangrape on women

In a shocking incident, a cousin of a girl was brutally beaten up by a mob for allegedly misbehaving with her in Madhya Pradesh’s Neemuch area.

ITEMVIDEOS: సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అకాతాయి అన్నకు గుణఫాఠం

Posted: 04/28/2016 06:12 PM IST
Cousin misbehaves with sister beaten up by mob

పని, పాట లేకుండా అకతాయిగా తిరుగుతూ, అమ్మాయిలను వేధిస్తున్న ఓ యువకుడికి స్థానికులు గుణపాఠం చెప్పారు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో అకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అవారాగా తిరిగే ఓ యువకుడు వరుసకు తన సోదరైన యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి తండ్రితో పాటు స్థానికులు కూడా రెచ్చిపోయి తలో చెయ్యి వేసి అకతాయికి బద్దిచెప్పారు. స్థానికులతో తాట తీయించుకున్న యువకుడి వీడియోను స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

వావివరసలు మర్చిపోయి సోదరిపై లైంగిక దాడికి యత్నించడంతో అతడిని స్థానికులు చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. తాను ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న క్రమంలో తనను బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడని బాధితులు తెలిపింది. తన తల్లిదండ్రులు వారించినా వినకుండా తనను ఎత్తుకుపోయాడని వాపోయింది. స్థానికుల సహకారంతో అతడి బారి నుంచి తప్పించుకున్నానని చెప్పింది.

ఈ విషయన్ని తన తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఇవాళ కాపుగాసి యువకుడిని పట్టుకుని కోట్టారని తెలిపింది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు కూడా సోదరిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై తలో చేయి వేసి తాటతీశారు, ఆనక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి స్థానికులు దేహశుద్ధి చేసినప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Cousin misbehave  Neemuch  Madhya Pradesh  

Other Articles