దేశ సైన్యం ఓ పక్కన యుద్దం చేస్తుంటే ఆ దేశ ప్రధాని ఏమీపట్టనట్లు కూర్చెంటే ఎలా ఉంటుంది. నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ అలాగే కూర్చున్నారని తాజాగా ఓ పుస్తకంలో వెల్లడైంది. ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా విడుదల చేసిన పుస్తకంలో అంశాల ఆధారంగా చూసుకుంటే ఇందిరాగాంధీ 1971 యుద్దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం చెలరేగే సమయానికి ఇందిరాగాంధీ ఇంట్లో దివాన్ మీద దుప్పటి మార్చుకుంటున్నారట. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన మాథుర్ సుమారు 20 ఏళ్ల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలను, పరిణామాలను ఆయన తన తాజా పుస్తకంలో రాశారు. 'ద అన్‌సీన్ ఇందిరాగాంధీ' అనే ఈ పుస్తకంలో అంశాల ఆధారంగా ఇందిరాగాంధీకి సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి.
1971, నవంబర్ 5న యుద్ధం మొదలైంది. మర్నాడు నవంబర్ 6న డాక్టర్ కేపీ. మాథూర్ అప్పటి ప్రధాని ఇందిర ఇంటికి వెళ్లారట. ఆప్పుడామె స్వయంగా బెడ్‌కవర్లు మార్చుతూ కనిపించారట. బహుశా ఈ పని ద్వారా ముందురోజు అర్థరాత్రి వరకు ఉన్న పని ఒత్తిడి నుంచి ఆమె బయటపడి ఉంటారని పుస్తకంలో పేర్కొన్నారు. యుద్ధం మొదలైన రోజు కూడా ఇందిర ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉన్నారని ఆయన తన పుస్తకంలో వెల్లడించారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసిన మాథూర్ రెండు దశాబ్దాల పాటు ఇందిరా గాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. అప్పటి అనుభవాలను తన 92 ఏళ్ల వయసులో ‘ది అన్ సీన్ ఇందిరాగాంధీ’ అనే పేరుతో పుస్తకం రాశారు.
1966లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఆమె తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారట. ప్రధానిగా బిజీగా ఉంటూనే శని, ఆదివారాల్లో ఏ మాత్రం వీలుదొరికినా.. పుస్తకాలు చదివేవారట. మధ్యాహ్న భోజనం ముగిశాక కొన్నిసార్లు పేకాట ఆడేవారని కూడా రాశారు. ఇందిరకు ధార్మిక భావాలు మెండని, అలాగే మూఢనమ్మకాలూ ఎక్కువేనని మాథుర్ పుస్తకంలో ప్రస్తావించారు. 'గురు ఆనందమయి మా' ఇచ్చిన రుద్రాక్ష మాలను ఆమె నిరంతరం ధరించేవారని, పలుమార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వెళ్లారని మాథూర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. 1971 డిసెంబర్ మూడో తేదీన పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించే సమయానికి ఇందిర కోల్‌కతాలో ఉన్నారట. వెంటనే ఢిల్లీకి వచ్చేసిన ఆమె యుద్ధం గురించి పెద్దగా టెన్షన్ ఏమీ పడలేదని, యుద్ధవ్యూహాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించే ఆలోచించేవారని మాథుర్ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more