టీమిండియా కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోని ఇటీవల అమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వైదోలగిన అంశంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ స్పందించారు. పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంగా చట్టసమ్మతి ఉన్న కంపెనీపై ఒక వ్యక్తి ప్రభావం ఎంతమాత్రం ఉండదన్నాడు. అలా అని ఆ సంస్థ చేసే అన్ని పనులకు ఒక వ్యక్తిని బాధ్యుడ్ని చేయడం కూడా సరికదాని ఆయన అభిప్రాయపడ్డారు.
'రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అన్ని సందర్బాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్బాల్లో అదే వ్యాపారం చాలా నిజాయితీగా సాగినా.. మరికొన్ని సందర్భాల్లో అంచనాలకు తగ్గట్టుగా ఉండదు. ఒక వ్యక్తి యావత్ సంస్థనే ప్రభావితం చేయలేడు. అటువంటప్పుడు ఆ సంస్థ నుంచి ధోని వైదొలగాలని డిమాండ్ రావడం దురదృష్టమే. ఒక సంస్థ ఇచ్చిన హామీలకు క్రికెటర్ ను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. గతంలో మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కూడా అమితాబ్ బచ్చన్, మాధూరీ దీక్షిత్, ప్రీతి జింటాలపై కూడా ఇదే తరహాలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది'అని అనిల్ కపూర్ తెలిపాడు.
ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం మానుకోవాలని ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆ సంస్థ ధోనీని దుర్వినియోగం చేసింది. దోనితో ప్రచారం చేయించుకుని కస్టమర్లను నడివీధిలో వదిలేసిందని.. కనీస మౌలిక వసుతులు కల్పంచకుండా అక్యూపెన్సీని ఇచ్చిందంలూ బాధితుల సంఘం ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి సంస్థ నుంచి ధోని ఆకస్మికంగా వైదొలిగాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more