Amid row over Modi's educational qualifications, report says PM got a first class in MA from Gujarat University

Arvind kejriwal questions pm narendra modi s qualification report claims he scored 62 3 in ma

Narendra Modi, Prime Minister, Gujarat, educational qualifications, MA, Anandiben Patel, Arvind Kejriwal, Central Information Commission (CIC), RTI, Gujarat University, Political Science, Education

A report claims that Narendra Modi was an above average student and that he secured a first class as a post-graduate student of political science.

ప్రధాని క్వాలిఫికేషన్ వివరాలు మీకు తెలుసా..?

Posted: 05/01/2016 12:20 PM IST
Arvind kejriwal questions pm narendra modi s qualification report claims he scored 62 3 in ma

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన విద్యార్హతలు ఏమిటి? అసలు ఆయన విద్యార్థిగా ఎలా ఉన్నారు. బాగా చదివారా.. నేటి విద్యార్థుల మాదిరిగా ఆయన కూడా పోటీ తత్వం అలవర్చుకున్నారా..? ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నారా? వంటి పలు అంశాలు తెలుసుకునేందుకు దేశప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు అయన విద్యార్హతలపై అసక్తి కలగడానికి కారణమం మాత్రం అప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలను తెలియజేయాలని, వాటిని గోప్యంగా ఎందుకు వుంచుతున్నారని, ప్రధాని క్వాలిఫికేషన్ ఎంటో తెలుసుకోవాలని యావత్ దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన ఇటీవల కేంద్ర సమాచార కమీషనర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఐసితో పాటుగా గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలకు ఆ సమాచారం తమకు అందించాలని ఆదేశించారు.

అయితే, కమీషనర్ ఎలాంటి సమాచారం అందించనప్పటికీ.. ప్రధాని మోడీ విద్యార్హత వివరాలను అహ్మదాబాద్ మిర్రర్ అనే పత్రిక వెల్లడిస్తూ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాలను వాస్తవాలుగా పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ క్లాస్ సాధించినట్లు వెల్లడించింది. మోదీ సగటు విద్యార్థికంటే మెరుగైన దశలో ఉండేవారని ఎంతో క్రమ శిక్షణతో నడుచుకునే వారని తెలిపింది. 1983లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన మోదీ.. 62.3శాతం మార్కులతో పట్టా పొందారని ఆయన యూరోపియన్ పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ అనాలసిస్, సైకాలజీ ఆఫ్ పాలిటిక్స్ చదివారని చెప్పింది.

అయితే, మోదీ గ్రాడ్యుయేషన్ చెప్పకుండా.. విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ప్రిసైన్స్ చదివినట్లు తెలిపింది. అంతేకాదు మోదీ ప్రి-సైన్స్ చదువుతున్న సమయంలో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ ఆ సమయంలో ఇనార్గినిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేస్తున్నారట. వీరిద్దరి రోల్ నెం కూడా 71. గతంలో పలువురు వ్యక్తులు ఈ వివరాలు తెలపాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నా గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలు ఆ వివరాలు తెలిపేందుకు నిరాకరించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm narendra modi  educational qualifications  MA  Gujarat university  aravind kejriwal  

Other Articles