అది యాక్సిడెంట్ కాదు.. హత్యే! | Is it murder or accident

Is it murder or accident

Hyderabad, Devi, Journalist Colony, Accident, Murder, హైదరాబాద్, యాక్సిడెంట్, హత్య

In Hyderabad Jounalist colony, a engineering student met with accident. But Parents said that that is not accident its a murder.

అది యాక్సిడెంట్ కాదు.. హత్యే!

Posted: 05/05/2016 09:15 AM IST
Is it murder or accident

రెండురోజుల క్రితం హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో చెట్టును కారు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవి మరణం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవి ప్రమాదం వల్ల చనిపోలేదని ఆమెను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కారు నడిపిన భరతసింహారెడ్డితో అసలు తమ అమ్మాయికి పరిచయమే లేదని మృతురాలి పెద్దనాన్న చెప్పారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానంటూ ఫోన్ చేసిన దేవిని కారులోని హతమార్చారని ఆయన ఆరోపించారు. కారు నడిపిన భరతసింహారెడ్డికి చిన్న గాయం కూడా కాలేదని ఆయన అన్నారు.

కారులో ఓ అమ్మాయి, అబ్బాయి గొడవ పడినట్లు తాను గమనించానని అక్కడే ఉన్న వాచ్ మెన్ తెలిపాడు. గొడవ పడ్డ దేవి కారు దిగగా ఆమెను మళ్లీ కారులోకి లాక్కున్నారని ఆ సమయంలో రక్షించండంటూ కేకలు వేసిందని ఆయన వివరించాడు. పోలీసుల స్టేట్ మెంట్ లోనే వైరుద్ధ్యం ఉందని బంధువులు ఆరోపించారు. డీసీపీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెబుతుంటే ఎస్ఐ భరత్ శరీరంలో ఆల్కహాల్ లేదని ఎఫ్ఐఆర్ లో యాక్సిడెంటుగా కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పోస్టుమార్టం నివేదిక కూడా తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles