బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-కంగనా రౌనత్ ల ప్రేమ వ్యవహారంలో రోజుకో ట్విస్టు బయటపడుతుండటంతో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేది తెలుసుకునేందుకు బీ టౌన్ వర్గాలతో పాటు నటీనటుల అభిమానులు, సాదారణ ప్రేక్షకులకు సైతం అసక్తి కనబరుస్తున్న తరుణంలో మరో బాలీవుడ్ జోడీ బ్రేక్ అప్ కు రెడీ అవుతుందన్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. అదేంటి ఇప్పటికే బాలీవుడ్ లో బందాలు, అనుబంధాలు, ప్రేమానురాగాల కోసం వెతుకుతున్న వారికి ఇది పిడుగులాంటి వార్తే.
బాలీవుడ్ అడోరబుల్(ముచ్చటైన) జంటగా ఇప్పటికే పేరొందిన వాళ్లు కూడా తమ ప్రేమ బంధాన్నికాదని విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా టీమిండియా మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో ఆయన పాత్రధారుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ తన భార్యతో విడిపోనున్నాడు. నటిస్తున్నాడు. ఈ విషయాంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనే ఈ మేరకు తన ట్విట్టర్ లో పేర్కోంటూ అభిమానులకు నిజంగానే షాక్ ఇచ్చాడు.
సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగుతూ.. అందరినీ సంభ్రమాశ్చార్యాలో ముంచారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు కూడా విడిపోతున్నారన్న సంచలన వార్త. ప్రేమలో పడిన ఇద్దరు తెగ తిరిగేసి.. త్వరలో పరిణయం కూడా చేసుకుంటామంటూ చెప్పిన జంట.. అకస్మాత్తుగా బ్రేక్ అప్ అయ్యారంటూ వార్తులు గుప్పుమన్నాయి. ఇక పత్రికల కథానాలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని భావించిన సుశాంత్ అ మేరకు సంకేతాలను ఇచ్చేశాడు.
అంకితతో బ్రేకప్ అయినట్లు సుశాంత్ సన్నిహితుల వద్ద చెప్పాడట. ట్విట్టర్లో తన బ్రేకప్ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు సుశాంత్. ఇప్పుడు వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ జీవితాన్ని పంచుకుంటారని ఆశపడ్డారు. కానీ, ఇంతలోనే బ్రేకప్ వార్తలు ప్రచారం జరిగాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందనుకుంటున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’.. ఈ మూవీ షూటింగ్స్ లో భాగంగా కాస్త చనువుగా ఉండటంపై అంకిత కోపంగా ఉండటమే ఈ బ్రేకప్ వరకు వెళ్లిందని బాలీవుడ్ వర్గాల టాక్. కాగా అంకిత, సుషాంత్ బ్రేక్ అప్ వార్తలపై మీడియా కథనాలను కూడా ఆయన తోసిపుచ్చారు. అమె తాగుబోతు కాదని, తాను తిరుగుబోతు కాదని తన ట్విట్టర్ లో పేర్కోన్నాడు. అయితే సుషాంత్ ధోని జీవిత కథంశం తరువాత మరో క్రీడాకారుడి జీవిత చరిత్రను కూడా తెరకెక్కించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more