IAS Officer Who Put His Foot On Hospital Bed Says Sorry On Facebook

Chhattisgarh ias officer puts feet on a patients bed apologises

jagdish-sonkar,ias officer,chhattisgarh,in-socialmedia, social media outrage on ias phot, ias apologises, facebook, chattisgarh ias, Jagdish Sonkar foot on patient bed

An IAS officer in Chhattisgarh sparked social media outrage after a photo of him, standing with a foot resting on the steel rail of a hospital bed went viral. IAS officer Jagdish Sonkar has now tendered an apology on Facebook.

ఈయన కూడా ఐఎఎస్ అధికారేనా..? మండిపడుతున్న నెట్ జనులు

Posted: 05/09/2016 03:27 PM IST
Chhattisgarh ias officer puts feet on a patients bed apologises

చత్తీస్గఢ్ ఐఏఎస్ అధికారి జగదీష్ సోంకర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఈయన కూడా ఓ ఐఎఎస్ అధికారేనా అంటూ నెట్ జనులు జగదీస్ సోకర్ పై మండిపడుతున్నారు. ఛత్తీస్ గడ్ లో విధులు నిర్వహిస్తున్న ఈ ఐఎఎస్ అధికారి.. తన విధులలో భాగంగా ఓ ఆస్పత్రికి తనిఖీకి వెళ్లినపుడు చేసిన చర్య వివాదాస్పదంగా మారింది. డాక్టర్ అయిన ఈ ఐఏఎస్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ను పరామర్శిస్తూ ఆ పేషెంట్ బెడ్పై కాలుపెట్టాడు. అది కూడా పిల్లల వార్డులోకి వెళ్లి పరామర్శించినప్పుడు ఇలా చేశాడు. అంతే ఈ ఫోటో పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేపింది. సూక్ష్మక్రీములు పిల్లల శరీరాలను త్వరగా చేరుకుని రోగాలను వ్యాప్తి చేస్తాయని తెలసి కూడా ఆయన ఇలా చేయడంలో అంతర్యమేమిటని మండిపడుతున్నారు నెట్ జనులు.

ఇలా నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో చివరాఖరున జగదీష్ సోంకర్ క్షమాపణలు చెప్పారు. తానేదో బాలుడి తల్లి చెబుతున్న విషయాన్ని వింటూ అనుకోకుండా అలా చేశానని, కానీ, కావాలని చేయలేదని, తన చర్య ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. 'నేను అనాలోచితంగా చేసిన చర్యకు బాధ్యతగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ చర్యను సమర్థించుకోవడానికి మాటలు చాలవు. అయితే కావాలని ఇలా చేయలేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్టకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నా' అని సోంకర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  IAS officer  Jagdish Sonkar  foot on patient bed  

Other Articles