బాలీవుడ్ యాక్షన్ హీరో భార్య.. ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా చేసిన ట్వీట్లు నెట్ లో దుమారానికి దారివేశాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు.. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ మీద ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సినిమాలకు గుడ్ బై చెప్పేశాక కుటుంబ జీవనానికే ప్రాధాన్యమిచ్చిన ట్వింకిల్ అప్పుడప్పుడూ పత్రికల్లో కాలమ్స్ అవీ రాస్తుంటుంది. ట్విట్టర్లోనూ కొన్ని ఆసక్తికర పోస్టులు పెడుతూ.. కామెంట్లు చేస్తుంటుంది. ఐతే ఈ మధ్య ఆమె దృష్టి ఎందుకు రవిశంకర్ మీదికి వెళ్లిందో కానీ.. ‘‘శ్రీ శ్రీ రవిశంకర్ ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నవారు. ఐతే ఆయనకు యోగా చేసే విధానం ఇబ్బందికరంగా ఉంటుంది. యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళ్తుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు’’ అని ట్వీట్ చేసింది ట్వింకిల్. అంతటితో ఆగకుండా.. ఆ ట్వీట్ కు ‘హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది.
ఈ ట్వీట్ రవిశంకర్ అభిమానుల మనోభావాల్ని దెబ్బ తీసింది. దీంతో ఆమెను తిట్టిపోస్తూ ట్వీట్లు గుప్పించారు వాళ్లంతా. అంతటితో ఆగకుండా ట్వింకిల్ పెట్టిన ట్వీట్ కు నిరసనగా.. ఆమె భర్త నటించిన ‘హౌస్ఫుల్-3’ సినిమాను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. దీంతో ట్వింకిల్ తప్పయిపోయిందంటూ లెంపలేసుకుంది. వెంటనే తన ట్వీట్ తీసేసి.. ‘‘ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు చేసి ఉంటే దిద్దుకుంటాను’’ అని వివరణ ఇచ్చింది. ఐతే తన భర్త సినిమాను బహిష్కరిస్తామని చేసిన హెచ్చరికల్ని ఆమె తప్పుబట్టింది. రవిశంకర్ మీకు ఇదే నేర్పిస్తున్నారా అని విమర్శించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more