Dalit woman stripped naked, beaten up in Uttar Pradesh: Report

Woman alleges she was stripped and paraded naked

Woman stripped and paraded naked, lucknow, shahjahanpur district, molestation on woman, woman naked parade Khairatia village, woman naked parade Khutar, ASP Ramesh Kumar, Uttar Pradesh, Dalit woman, atrocities against women, Land dispute, Hareva village, Shahjahanpur

A woman was allegedly stripped and paraded naked in Shahjahanpur district here on Monday. The incident took place following a land dispute between two groups at Khairatia village in Khutar.

ఈ పోలీసులకీ రెండు చేతులెత్తి దండం పెట్టాలి..

Posted: 05/11/2016 03:00 PM IST
Woman alleges she was stripped and paraded naked

పెద్దవాళ్ల విషయంలో ఏదేని విచారణ జరుగుతున్న చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రోటీన్ డైలాగ్ వినిపించే పోలీసులు.. ఈ పేదరాలి విషయంలో మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నాపై వాళ్లు తెగబడి దాడి చేశారు మొర్రో అంటూ బాధితురాలు తన అర్తిని విన్నవించుకున్నా.. ఎలాంటి కనికరము లేకుండా అమె అర్జీని (పిర్యాదు తీసుకునేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారు. అమె వైరి ఫక్షంపై కావాలనే ఈ ఆరోపణలు సంధిస్తుందని, ఇదంతా నాటకమని కోట్టిపారేస్తూన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహానఫూర్ జిల్లా కైరటియా గ్రామంలో ఇరువర్గాలకు మధ్య భూవివాదం నెలకొంది. కాగా దళిత మహిళ ఇంట్లో ఒంటరిగా వుందన్న సమాచారం అందుకున్న అమె వైరివర్గం అదే రోజు రాత్రి అమె ఇంటిపై దాడి చేసి అమెను వివస్త్రను చేసి గ్రామంలో నగ్నంగా తిప్పారు. అంతేకాదు అక్కడి చేరువలోని చెరువ వద్దకు తీసుకెళ్లి అమెపై దాడులకు తెగబడ్డారు. వారి దెబ్బలు తాళలేక అమె సృహకోల్పోగానే మరణించిదని భావించిన వైరి వర్గం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఆ రోజు రాత్రి వివస్త్రగానే అక్కడున్న అమె.. సోమవారం సృహ వచ్చిన తరువాత విషయం బంధువులకు చెప్పింది.

బంధువుల సహకారంతో అమె తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు పిర్యాదు చేసింది. కాగా అమె పిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. అదే పెద్దలిచ్చే పిర్యాదులపై అప్పటికప్పుడు ఎప్ ఐ ఆర్ లు నమోదు చేసి.. వెనువెంటనే అరెస్టులు గట్రాలు చేసే పోలీసులు.. మాకు ఏ సంబంధం లేదన్న అన్ని విషయాలు కోర్టులో చెప్పకోండంటూ రోటిన్ డైలాగ్ వల్లేవేస్తారు. కానీ పేదలు, అందులోనూ దళిత మహిళ తనను వివస్త్రను చేశారని, గ్రామంలో నగ్నంగా ఊరేగించారని పిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయకుండా.. పైపెచ్చు అవన్నీ అవతలి వారిని కేసుల్లో ఇరికించేందుకు డ్రామాలంటూ కోట్టిపారేయడం వారికే చెల్లింది. గ్రామంలో తనను నగ్నంగా ఊరేగించారని ఏ మహిళ అయినా చెప్పుకుంటుందా..? అసలు అది విషయమే కాదన్నట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో పోలీసులకే తెలియాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles