Blackmail won't work, asserts confident Chandy

Saritha vows to present more scorching proof

solar scam, kerala solar scam, saritha nair solar scam, saritha nair, solar scam, oomen chandy, kerala congress, digital evidence, solar scam saritha nair, kerala solar scam news, digital evidence

Saritha statements are not credible. Everyone is aware that the bar lobby is at work here. She has kept changing it from court to court says cm oomen chandy

‘‘నన్ను పూర్తిగా వాడేసుకున్నారు..’’ ‘‘అబద్దాలను ప్రజలు నమ్మరు..’’

Posted: 05/12/2016 11:48 AM IST
Saritha vows to present more scorching proof

కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, సమాజంలో తనను ఒక దోషిగా నిలబెట్టారని కేరళ సోలార్ స్కాంలో కీలక నిందితురాలు సరితా నాయర్ అవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె విచారణ కమిషన్‌కు సమర్పించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం ఉందనగా సరితా నాయర్ తన తాజా అస్త్రాన్ని బయటకు తీయడం గమనార్హం. కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని తాను చెప్పుకోచ్చింది.

ఇందుకు సంబంధించి తాను రెండు పెన్ డ్రైవ్‌లు, కొన్ని పత్రాలను కమిషన్‌కు సాక్షాలుగా సమర్పించానని, తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. మరికోన్ని అధారాలను రేపు అనగా శుక్రవారం కమీషన్ కు సమర్పిస్తానని మరో బాంబు పేల్చింది. కాగా, సరితా నాయర్‌పైన, ఏషియానెట్ చానల్‌పైన సీఎం ఊమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పరువునష్టం దావా వేశారు.

సరితా నాయర్ మీద, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ మీద సోలార్ స్కాంలో దాదాపు 30 వరకు కేసులు ఉన్నాయి. వాళ్లు పలువురు పెట్టుబడిదారులను దాదాపు రూ. 6 కోట్ల మేర ముంచేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిత బెయిల్ పొంది బయటకు రాగా, రాధాకృష్ణన్ మాత్రం తన మొదటి భార్య హత్య కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఉమెన్ చాంధీ మాత్రం అమె వెనకు బార్ యాజమానులు వున్నారన్న విషయం యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు.

అయితే సరిగ్గా ఎన్నికల తరుణంలో అమె ఈ ఆరోఫణలు మరింత తీవ్ర చేయడం వెనుక బార్ యాజమానులతో పాటు మరెవరెవరున్నారన్న విషయం తనకు తెలియదన్నారు. సరితా నాయర్ ఒక కోర్టులో చెప్పినదానికి మరో కోర్టులో చెసిన అరోపణలకు పొంతన లేదని, ఇక తాజాగా నియమించిన కమీషన్ ఎదుట కూడా అమె అరోపణలు చేస్తుందని, కానీ వాటిలో నిజం మాత్రం లేదని ఉమెన్ చాంధీ అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న విషయం తెలుసుకునే అమె తమపై అరోపణలను తీవ్రం చేసిందని ఆయన దుయ్యబట్టారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saritha nair  solar scam  oomen chandy  kerala congress  digital evidence  

Other Articles