Hcu jac students alleges venkaiah naidu is supressing rohit vemula suicide issue

Is venkaiah naidu central minister or local leader

union minister venkaiah naidu, venkaiah naidu supressing rohit vemula suicide case, union minister venkaiah naidu galli leader, venkaiah naidu behing vc appa rao, hyderabad university jac, venkatesh chouhan, rajkumar sahu, arpita, sanjay, vc appa rao, HCU jac

Hcu jac students alleges union minister venkaiah naidu is behing vc apparao and supressing rohit vemula suicide issue, he is behaving like local galli leadet

వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రా.. గల్లీ నాయకుడా..?

Posted: 05/14/2016 09:18 AM IST
Is venkaiah naidu central minister or local leader

వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రా..? లేక గల్లీ నాయకుడా..? అర్థ కాని పరిస్థితి నెలకొందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు విమర్శించారు. తమ విద్యార్థి సంఘం నేత రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై కొనసాగుతున్న ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు అన్నారు. వెంకయ్యనాయుడు తనకు సంబంధం లేని శాఖలో కూడా వేలు పెట్టి మరీ జోక్యం చేసుకుంటున్నారని వారు అరోపించారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఆయన గల్లీ స్థాయి నాయకుడిలా విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతూ వారిని తమ వైపు తిప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా హెచ్ సీయూ జేఏసీ నేత వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్న రాజ్‌కుమార్ సాహుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఈ ఘటనతో వీసీ వెనుక వెంకయ్యనాయుడు ఉన్నాడన్నది స్పష్టమైందన్నారు. ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన సాహు అదేరోజు వీసీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఏప్రిల్ 12న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కరు మినహా 948 మంది విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మరో నేత అర్పిత అన్నారు.

సంజయ్ మాట్లాడుతూ ఉద్యమ అవసరాలకోసం పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజం నుంచి ఆర్థిక సహాయం పొందారని, ప్రతిపైసా ఉద్యమానికే వినియోగించామన్నారు. ఆధారరహిత ఆరోపణలను పట్టుకొని మంత్రి వెంకయ్య నాయుడు హెచ్‌సీయూ విద్యార్థులను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వీసీ అప్పారావుకు పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయనను కాపడుతున్న వెంకయ్యనాయుడు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఆమ్‌ఆద్మీ స్పాన్సర్డ్ ఉద్యమంగా  ముద్రవేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావని, పాస్ చేయమని అధ్యాపకులు,వీసీ చేస్తున్న బెదిరింపులకు లొంగవద్దన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  vc appa rao  rohit vemula  suicide case  HCU jac  

Other Articles