Osama Bin Laden | Terrorists | Jihads | Liberate Palestine | Hamza bin Laden | audio message | Al Qaeda terrorist group

Is bin laden s son being groomed for key al qaeda role

Osama Bin Laden, Terrorist, Jihads, Liberate Palestine, Hamza bin Laden, audio message, liberate Palestine, Al Qaeda terrorist group, Hamza bin Laden to lead Al Qaeda

Osama bin Laden's young son Hamza bin Laden, might be next in line to lead the terrorist group his father founded decades ago. He released an audio message this week calling on jihadists to unite and "liberate Palestine," leading experts to theorize that he's being groomed to take over Al Qaeda, according to the British publication The Independent.

తెర మీదకు లాడెన్ కొడుకు.. ఉగ్రవాద వారసత్వం..

Posted: 05/14/2016 12:14 PM IST
Is bin laden s son being groomed for key al qaeda role

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ వారసుడు తెరమీదకు వచ్చాడు. లాడెన్ 23 ఏళ్ల కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ తండ్రి బాటలో అల్‌-ఖైదా సంస్థ నాయకత్వాన్ని స్వీకరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. పాశ్చాత్య దేశాలను మట్టి కరిపించేందుకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సిరియాలోని ముజాహిద్దీన్లంతా ఏకం కావాలంటూ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియా టేప్‌-లో హమ్జా పిలుపునిచ్చాడు. ‘ఇస్లామిక్‌ ఉమ్మా (జాతి) అల్‌ శ్యామ్‌ (సిరియా)లోని జిహాదీపై దష్టిని కేంద్రీకరించాలి. ముజాహిద్దీన్లందరినీ ఏకం చేయాలి. నేడు ముస్లిం ప్రపంచానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం ఏకమైంది. ఈ తరుణంలో విభేదాలకు, వివాదాలకు ఆస్కారం ఇవ్వరాదు. కలిసికట్టుగా పోరాడాలి’ అని హమ్జా పిలుపునిచ్చాడే. తన తండ్రికి ఇష్టమైన కవితతో హమ్జా తన సందేశాన్ని ప్రారంభించాడు.

పాకిస్తాన్‌-లోని అబ్బోటాబాద్‌-లో అమెరికా కమాండో ఆపరేషన్లో తన తండ్రి ఒసామా బిన్‌ లాడెన్‌ హతమైన ఐదేళ్ల తర్వాత హమ్జా తొలిసారి లేదా రెండోసారి జిహాదీలను ఉద్దేశించి సందేశం ఇచ్చాడు.  గత సంవత్సరం ఆగస్టు నెలలో హమ్జా పేరిట ఒక ఆడియో సందేశం విడుదలైంది. అది అతని సందేశం కాకపోవచ్చనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. అప్పటి ఆ సందేశం కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. సిరియాలోని జిహాదీలంతా ఏకం కావాలంటూ ఒసామా బిన్‌ లాడెన్‌-కు కుడిభుజంగా వ్యవహరించిన అల్‌ జవహరి శనివారం సందేశం ఇచ్చిన అనంతరం హమ్జా సందేశం కూడా విడుదల కావడం వల్ల నాయకత్వంవైపు హమ్జా అగుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అబ్బోటాబాద్‌ ఆపరేషన్లో తండ్రి ఒసామాతో పాటు హమ్జా బిన్‌ లాడెన్‌ కూడా మరణించాడని ముందుగా అమెరికా భావించింది. అయితే హమ్జాకు బదులుగా ఖలీద్‌ అనే మరో కొడుకు మరణించినట్లు తెలిసింది. ఆ ఆపరేషన్‌ సందర్భంగా హమ్జా అప్పుడు ఆ ఇంట్లో ఉండి, తప్పించుకొని పారిపోయాడా? లేక ఆ సమయంలో అక్కడ లేకుండా మరెక్కడైనా ఉన్నాడా? అనే విషయం ఇప్పటికీ మిస్టరీనే. తన అనంతరం హమ్జానే వారసుడు కావాలని ఒసామా బిన్‌ లాడెన్‌ కోరుకున్నాడని, అందులో భాగంగా హమ్జాకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ కూడా ఇచ్చారని పాశ్చాత్య ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టులు అంతర్గత గొడవలు, పాశ్చాత్య సంకీర్ణ దళాల దాడుల్లో ఇటీవల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ జిహాదీల తరఫున అల్‌-ఖైదా టెర్రరిస్టులు కూడా పోరాడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో హమ్జా అల్‌-ఖైదా నాయకుడిగా తెర మీదకు వస్తే జిహాదీలకు కొత్త ఊపు వస్తుందని, అది అమెరికాకు పెను ముప్పుగా మారవచ్చవచ్చనేనది విశ్లేషకులు భావనగా ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles