భవిష్యత్ రవాణా రైలు మార్గమేనా.. అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అయితే ఇప్పటికే సూపర్ ఫాస్ట్, హైస్పీడ్, రైళ్లను చూసిన ప్రజలకు వాయువేగంతో నడిచే రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానుంది, మామూలు స్పీడు కాదు ఏకంగా విమానం కన్నా వేగంగా వుండబోతుంది ఈ రైల్లో ప్రయాణం. ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది.
గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో.. విస్మయపరిచే ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు.
ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more