Disturbing footage shows lion pull buffalo foetus from animal carcass

Car caught in kruger buffalo stampede

viral video, trending video, video footage, Buffalo, Cape Buffalo, Kruger, National Park, Kruger Park, Car, stampede, safari, South, Africa, Kruger National Park, Lions, Kruger sighting, crash

Cellphone footage taken by the driver of a vehicle that was driving behind the white sedan shows the herd approaching a waterhole before stampeding in the opposite direction.

ITEMVIDEOS: సింహగర్జన.. దుమ్మురేపిన ధున్నలు

Posted: 05/15/2016 11:57 AM IST
Car caught in kruger buffalo stampede

భయం ఏ జీవినైనా పరుగులు పెట్టిస్తుంది. అదే ప్రాణభయం అయితే.. భయాందోళనతో పరుగులేంటి.. ఎదురుగా ఏముందన్న విషయాన్ని కూడా చేసుకోకుండా పరుగులంకించడం జీవులకు అలవాటు. సరిగ్గా అక్కడ కూడా అలానే జరిగింది, దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు.

వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు.

ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : video footage  cars  passing  Kruger Park  buffaloes  walk  South Africa  

Other Articles