Obama, we're hiring! UAE lawyer offers president top Dubai job

Obama receives lucrative job offer from dubai

barack obama, democratic party, dubai, eisa bin haidar, emiratis, islam, law firm, news, president barack obama, president obama, tolerance, uae, united arab emirates, united states presidential election, white house

An Emirati lawyer from Dubai has offered a job in his law firm to outgoing US President Barack Obama, so that he can become “closely acquainted” with the “meaning of tolerance of Islam” once he leaves the White House.

ఒబామాకు జాబ్ ఆఫర్.. సకల సదుపాయాలతో..

Posted: 05/17/2016 06:52 PM IST
Obama receives lucrative job offer from dubai

అమెరికా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు భాద్యతలు నిర్వహించిన తరువాత వారు ఏం చేస్తారు. తమ జీవనాన్ని కొనసాగించడానికి ఏం చేస్తే వారి ప్రమాణాలు దిగజారకుండా అలాగే కొనసాగుతాయి. సోషల్ స్టేటస్ లో అగ్రరాజ్య అద్యక్షుడన్న స్థాయి అందుకున్న వారు అ హోదాను పదవీ విరమణ తరువాత నిలబెట్టుకోవడానికి ఎం చేయాల్సి వుంటుంది. ఇలాంటి సందేహాలే దుబాయ్ లోని  ఓ న్యాయవాదికి వచ్చినట్లున్నాయి అందుకనే కాబోలు త్వరలో పదవీ విరమణ చేయబోతున్న బరాక్ ఒబామాకు ఆయన దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తానంటూ ఆఫర్ చేశాడు.

అయితే అదేదో ఒబామా మీద ప్రేమతో జాబ్ ఆఫర్ ఇచ్చాడనుకుంటే పోరబాటే. ఎందుకంటారా..? తన లా కంపెనీలో ఉద్యోగం ఇస్తానన్న లాయర్, దానివల్ల ఇస్లాం మతంపైన, సహనంపైన ఒబామాకు మరింత అవగాహన వస్తుందని ఆ లాయర్ అన్నాడు. ఇస్లాం పట్ల సహనం అంటే అర్థం ఏంటో మరింత బాగా తెలుసుకోడానికి ఈ ఉద్యోగం ఆయనకు ఉపయోగపడుతుందని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ట్వీట్ చేశారు. మంగళవారం నాటికి ఒబామా పదవీ కాలం ఇంకా 247 రోజులు ఉంటుంది. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20వ తేదీన పదవీ స్వీకారం చేయాల్సి ఉంటుంది.  

ఆయనకు జీతంతో పాటు ఉండేందుకు ఇల్లు, అరబ్ దేశాలు తిరిగి రావడానికి టికెట్లు కూడా ఇస్తానని ఆ లాయర్ ఆఫర్ చేశారు. అమెరికన్, పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఇస్లాంను ఉగ్రవాదానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే అది పూర్తి అవాస్తవమని... ఇస్లాం అంటేనే సహనానికి, క్షమాగుణానికి, అర్థం చేసుకోడానికి మారుపేరని చెప్పారు. పాశ్చాత్యులు ఇస్లాంను అర్థం చేసుకుని, ఆమోదించడానికి ఏకైక మార్గం వాళ్లొచ్చి తమతో కలిసి ఉండటమేనని, ఒబామా వైట్‌హౌస్‌ను వదలగానే ఆయనకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ ఇస్తానని తెలిపారు. అరబ్బులు, ముస్లింలతో కలిసి ఉంటే ఆయనకు సహనానికి అసలైన అర్థం తెలుస్తుందని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Dubai lawyer  President Barack Obama  UAE  United States  job offer  

Other Articles