Fresh Red Corner notice against JeM chief Masood Azhar

Fresh red corner notice against jem chief masood azhar

Patankot, Red corner notices, Abdul Rauf, Maulana Masood Azhar, రెడ్ కార్నర్ నోటీసులు, మసూద్ అజర్, పటాన్ కోఠ్

The Interpol has issued two Red Corner Notices (RCN) against Jaish-e-Mohammad (JeM) chief Maulana Masood Azhar and his brother Abdul Rauf who India suspects plotted the attack on the Pathankot airbase.Both already have RCNs pending against them in connection with terror activities. Sources said the new RCNs were issued by Interpol on May 13 and uploaded on its website.

మసూద్ అజర్ కు రెడ్ కార్నర్ నోటీసులు

Posted: 05/18/2016 07:12 AM IST
Fresh red corner notice against jem chief masood azhar

అంతర్జాతీయంగా ఇండియా చేస్తున్న వత్తిడి బాగా పనిచేస్తోంది. దేశంలోని వైమానిక దళాల కేంద్రాల్లో ఎంతో కీలకమైన పఠాన్ కోట్ దాడిపై భారత్ గుర్రుగా ఉంది. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై దాడికి కుట్ర పన్నినందుకు గాను జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. మొహాలీలోని జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఇటీవల వీరిద్దరిపై వారంట్లు జారీ చేసింది.

పఠాన్‌కోట్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న కాశిఫ్ జాన్, షాహిద్ లతీఫ్‌లపై కూడా మొహాలీ కోర్టు వారంట్లు జారీ చేసింది. జాన్, లతీఫ్‌లపై కూడా ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉగ్రవాదం, మత్తు పదార్థాల కేసుకు సంబంధించి 1996లో అరెస్టయి జైలు జీవితం గడిపిన షాహిద్ లతీఫ్ (47)ను ప్రభుత్వం 2010లో విడుదల చేసి పాకిస్థాన్‌కు పంపించింది. గత జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి ఆరుగురు ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చి ఏడుగురు సైనికులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక మౌలానా మసూద్ అజర్ హస్తం ఉన్నట్టు భారత్ ఆరోపించగా, అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవని పాక్ పేర్కొంది. భారత పార్లమెంట్, జమ్ముకశ్మీర్ అసెంబ్లీపై దాడి కేసుల్లో ఇంటర్‌పోల్ ఇదివరకే మసూద్ అజర్‌పై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. మసూద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles