Horrific Ahmedabad accident caught on camera,

Ahmedabad accident caught on camera victims escape alive

caught on camera, gujarat, car accident, road accident, accident, road accident ahmedabad, breaking news, ahmedabad, AHMADABAD HORRIFIC Accident, victims escape alive

A horrific road accident has been captured on CCTV camera in Ahmedabad. The video shows two persons on a scooty entering a main road when they are hit by a mini SUV. Luckily, the duo managed to escape alive.

ITEMVIDEOS: షాకింగ్.. సిసీటీవీల్లో అహ్మదాబాద్ ప్రమాదం..

Posted: 05/18/2016 06:51 PM IST
Ahmedabad accident caught on camera victims escape alive

ఏదైనా జీవికి హాని జరుగుతుందంటనే కాపాలడాలని తన పనులను పక్కనబెట్టే మనిషి.. మనిషి ప్రాణానికి మాత్రం విలువనీయాడు. ముఖ్యంగా సంపన్నులకు పేదల ప్రాణాలంటే తృణప్రాయాలని ఇక్కడ ఈ ఘటన మరోమారు స్పష్టం చేసింది. స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు వ్యక్తుల్ని వేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ వాహనం భీకరంగా ఢీకొట్టింది. పక్కనుంచి వస్తున్న స్కూటీని పట్టించుకోకుండానే ఎస్‌వీయూ వాహనం వారిపైకి దూసుకెళ్లింది. స్కూటీ మీద ఉన్న వాళ్లిద్దరు గాలిలోకి ఎగిరారు. అయినా అదృష్టం బాగుండుటంతో వెంట్రుకవాసిలో ఆ ఇద్దరు మృత్యువు నుంచి తప్పించుకున్నారు.

గాల్లోకి ఎగిరినప్పటికీ వాహనం కింద పడకపోవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. స్కూటీని ఢీకొట్టిన ఆ లగ్జరీ వాహనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ముందుకెళ్లింది. గుజరాత్ లోని  అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన తరువాత కూడా కారు నిలుపకపోవడంతో సంపన్నుడి నిర్లక్ష్య వైఖిరిపై నెట్ జనులు మండిపడుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం తెలిసిన వారు మాత్రం నాలుగు రోడ్లు కలిసే ప్రధాన కూడాలిలో అటోను రోడ్డకు అడ్డంగా నిలపడేమే ప్రమాధానికి కారణమైందని ట్రాఫిక్ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై వాహనాలు పార్క్ చేయడం వల్ల.. పక్క నుండి వస్తున్న వాహనాలు కనబడకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. కారు చోదకుడు కూడా తమకు అటుగా వస్తున్న వాహనాలను గమనించే వీలు లేకపోవడంతోనే స్పీడుగా వచ్చి స్కూటీని ఢీకొన్నాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించి మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Horrific accident  Ahmedabad  victims escape alive  gujarat  

Other Articles