election results: assam, kerala, puducherry, tamilnadu, west bengal election results

Here are the results of five state assemblies

west bengal assembly elections, tamilnadu assembly elections, Kerala Assembly elections, assam assembly elections, puducherry assembly elections, Kerala polls 2016, west bengal polls 2016, tamil nadu polls 2016, assam polls 2016, pudducherry polls 2016,

We are indebted to the people of Tamil Nadu. My life is dedicated to them': Jayalalithaa on winning a second term as Tamil Nadu chief minister

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..

Posted: 05/19/2016 06:51 PM IST
Here are the results of five state assemblies

భారతీయ ఓటర్ల సరళిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నవిషయాన్ని తేటతెల్లం చేస్తూ జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రీ ఫోల్ సర్వేలు మొదలుకుని, ఎగ్జిట్ పోల్స్ వరకు అనేకంగా మారిన అంచనాలను రమారమి నిజం చేస్తూనే ఫలితాలు వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు రెండేళ్ల కాలంలో పలు రాష్ట్రాల్లో బీజేపి ఖాతాలు తెరువగా, పలు రాష్ట్రాల్లో మాత్రం అడ్రస్ గల్లంతయ్యింది. అయితే తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా 32 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓటరు తర్పునిచ్చారు.

పశ్చిమబెంగాల్‌లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించి మరో పర్యాయం అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. కలకత్తాలోని వివేకానంద నగర్ ఫ్లై ఓవర్ ను రాజకీయంగా వాడుకుని లబ్ధిపోదాలనుకున్న పార్టీలకు కూడా చావ దెబ్బను చాటి కోడుతూ.. చౌకబారు అరోపణలను కట్టిపెట్టాలని బెంగాల్ ఓటరు తీర్పనిచ్చారు. అదీనూ మూడింట రెండొంతుల మెజారిటీకి దిశగా బలాన్నిస్తూ దీదీకి అండగా నిలిచాడు.

అసోంలో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్ గొగోయ్‌ ప్రభుత్వం మాత్రం ఈ పర్యాయం ప్రభుత్వ వ్యతిరేక ఓటును మూటగట్టకుంది, కాగా మునుపెన్నడూ లేని విధంగా తలిసారిగా ఎన్నికల బరిలోకి దిగన బీజేపీ అనూహ్య రితీలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది, బీజేపి నేత శర్వానంద సోనోవాల్‌కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్ చాందీని దించి, ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది,

ఐదు రాష్ట్రాలలో బలాబలాలు:

అస్సోం: మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపి 86 స్థానాలతో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. కాగా కాంగ్రెస్ 25, ఎయుడిఎఫ్ 13, ఇతరులు 2 స్థానాలతో గెలుపోందారు.

పశ్చిమ బెంగాల్ : అన్ని పార్టీలతో పాటు ఇక్కడి ఎన్నికలలో తమ ప్రభంజనాన్ని చాటాలని భావించిన బీజేపికి బెంగాల్ ఓటరు కొంత కరుణించాడు. అధికార తృణముల్ పార్టీకి మూడింట రెడోంతుల మెజార్టీని ఇచ్చిన ఓటరు, ఆ తరువాత వామపక్షాలతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్ కూడా ఓటరు మహాశయుడిని కాసింత మెరుగ్గానే ప్రసన్నం చేసుకుంది, ఆ పార్టీకి 44 స్థానాలను గెలుపోందింది. అయితే గతంలో ఏకచక్రాధిపత్యం వహించిన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఓటరు తీర్పు రుచించలేదు. లెఫ్ట్ పార్టీలను మూడోవ స్థానానికి పరిమితం కాగా, కేవలం 33 స్థానాలలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపోందారు. ఇక్కడ బీజేపి ఆరు స్థానాలలో గెలుపోందింది.

కేరళ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను రమారమి నిజం చేస్తూ కేరళ ఓటరు తీర్పునిచ్చాడు. అయితే ఇన్నాళ్లు ద్విముఖ రాజకీయ పోటీకి మాత్రమే అవకాశాన్ని  ఇచ్చిన ఓటరు ఈ సారి మూడవ ప్రత్యామ్నాయాన్నికి కూడా అవకాశాన్ని ఇస్తూ కేరళలో బీజేపి పార్టీ తరపున రాజగోపాల్ ను గెలిపించాడు. అనవాయితాగా వస్తున్న ఐదేళ్లకో పర్యాయం అధికార మార్పడికే కేరళ ఓటరు మొగ్గుచూపాడు. కేరళలో అధికారంలో వున్న యూడీఎప్ నుంచి వామపక్షాల కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 140 స్థానాలున్న అసెంబ్లీలో వామపక్ష పార్టీ 91 స్థానాలను గెలుపోంది అధికారాన్ని చేపట్టనుంది. అధికార యూడీఎఫ్ పార్టీ 7 స్థానాలను దక్కించుకోగా మరో స్థానంలో స్వత్రంత్య అబ్యర్థి గెలుపోందారు. ఇక్కడ మరో పర్యాయం వామపక్ష కురువృద్ద నేత అచ్యుతానందన్ సీఎం పగ్గాలను చేపట్టనున్నారు.

తమిళనాడు : అమ్మ పథకాలు, అక్రమాస్థుల కేసు, విజయకాంత్ పార్టీ విడిగా ఎన్నికల బరిలో నిలవడం వంటి కారణాలతో 32 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ. తమిళనాడు ఓటరు అమ్మ పక్షాన నిలిచాడు. ఎగ్జిట్ పోల్స్ అంచానాలను తారుమారు చేస్తూ అమ్మ రెండో పర్యాయం అధికార పగ్గాలను చేపట్టనుంది, ఇక్కడ అధికార అన్నాడిఎంకే 134 స్థానాలలో విజయం సాధించగా ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమి 98 స్థానాలను గెలుపోందింది. గత ఎన్నికలలో 48 స్థానాలతో ప్రతిపక్ష హోదాను అదిరోహించిన డీఎండికే పార్టీ అడ్రస్ గల్లంతైంది. విజయకాంత్ పార్టీ ఒక్కె స్థానాన్ని కూడా గెలుపోందలేకపోయింది.

పుదుచ్చేరి: ఇక్కడ రంగస్వామి కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పలేదు. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు వుండగా, కాంగ్రెస్ కూటమి 17 స్థానాలతో విజయం సాధించగా, ఈ కూటమికి సగం కన్నా అధికంగా మోజారిటీ వుండటంతో అధికార పగ్గాలను అందుకోనుంది. రంగస్వామి కాంగ్రెస్ కు కేవలం 8 స్థానాలు మాత్రమే లభించాయి, పుదుచ్చేరిలో అన్నాడీఎంకే పార్టీ నాలుగు స్థానాలలో గెలుపోందింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles