న్యూయార్క్‌కి రెండు వారాల్లో ఓ ప్రత్యేక విమానం రానుంది. దాని పేరు 'సొలార్ ఇంపల్స్2'. దీని ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించకుండానే కేవలం సౌరశక్తితో మాత్రమే సగం ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయింగ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది. పగలు సౌరశక్తిని బాగా గ్రహిం చేందుకు 9,000 మీటర్ల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లిన పెలైట్ రాత్రిపూట ఇంధనాన్ని ఆదా చేసేందుకు 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరేవారు.
దీని కాక్‌పిట్‌లో ఒక్కరే పడతారు. పెలైట్ సీటునే టాయిలెట్‌గానూ వాడుకొనేలా డిజైన్ చేశారు. అండ్రూ బోర్ష్‌బెర్గ్(స్విట్జర్లాండ్), బెర్ట్రాండ్ పికార్డ్లు ఒకరి తర్వాత మరొకరు దీనికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. తిండి, నిద్ర అన్నీ ఆ కుర్చీలోనే. నిద్రపోవాలనుకుంటే సీటు కాస్త వెనక్కి వంచుకొని కునుకుతీయాలి. విమానాన్ని ఆటోపెలైట్ మోడ్‌లో పెట్టి... పైలెట్ 20 నిమిషాల చొప్పున నిద్రపోయేవాడు. విమానం లో సాంకేతికలోపమొస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవకాశం లేదు. పెలైట్ ప్యారాచూట్ సాయంతో సముద్రంలో దిగితే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చెక్కబల్ల (లైఫ్‌బోట్‌లాగా పనిచేస్తుంది) కాక్‌పిట్‌లో ఉంది.
'సోలార్ ఇంపల్స్2' ఒకే పైలెట్‌తో ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డును కూడా బద్దలుకొట్టింది. జపాన్‌లోని నగోయా నుంచి బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి అమెరికాలోని హవాయి దీవుల వరకు వెళ్లింది. నిరంతరాయంగా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. అయితే ఇక్కడితోనే దీని ప్రయానం అగలేదు. బ్రేక్ తరువాత మళ్లీ తన జైత్రయాత్రను కొనసాగించనుంది.
న్యూయార్క్ చేరుకున్న తర్వాత మరో పెద్ద లక్ష్యం సొలార్ ఇంపల్స్2 ముందు ఉంది. అక్కడి నుంచి బయలుదేరి అట్లాంటిక్ సముద్రాన్ని దాటనుంది. సౌర ఇంధనంపై అవగాహన కల్పించేందుకే ఈ జైత్రయాత్ర చేపట్టామని దీని పైలట్లు చెబుతున్నారు. 'పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఇంధనం లేకుండా ప్రపంచాన్ని చుట్టామంటే 'వావ్' అంటారు' అంటూ విమాన రూపకర్తల్లో ఒకరు, పైలెటైన బెర్ట్రాండ్ పికార్డ్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more