A fancy car registration plate in Lucknow showing support for ISIS?

Car registration plate to show support for isis

luckow police, maruti ertiga, car owner details, fancy registration, prohibited by the law, ISIS, Mahanagar wireless, Nishatganj railway overbridge, UP 32 HA 1515, ASP Traffic Habibul Hasan

The city police is trying to trace the owner of a motor vehicle which was seen sporting a fancy registration number plate, which is prohibited by the law.

ధేశంలో ఉగ్రవాదులకు బహిరంగ మద్దతు..?

Posted: 05/22/2016 04:51 PM IST
Car registration plate to show support for isis

ఉత్తర్ ప్రదేశ్ పోలీసులతో పాటు ఆర్టీఏ అధికారులకు ఇప్పుడా నెంబర్ వణుకు పుట్టిస్తుంది. 1515 నెంబరును ఎవరికైనా కేటాయించాలంటేనే అధికారులు ఒకటికి పది సార్లు వారి వివరాలను సేకరించడంతో పాటు వారికి పలు సూచనలను చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యింది. అలా ఎందుకని అంటారా..? ఆ నెంబరును తీసుకున్న ఓ కారు యజమాని ఏకంగా ఉగ్రవాద సంస్థకు మద్దతు పలుకుతున్నట్లుగా దానిని నెంబర్ బోర్డుపై రాయడంతో అధికారులు జంకుతున్నారు.

ఇలా చేసిన ఓ మారుతీ ఎర్టిగా కారు కోసం లక్నో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాని యాజమాని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సంక్షిప్తనామమైన ఐఎస్‌ఐఎస్‌ లాగా కనిపించేవిధంగా ఫ్యాన్సీ నంబర్‌ ప్లేటును తన వాహనానికి పెట్టుకోవడమే ఇందుకు కారణం. నిబంధనల ప్రకారం నంబర్‌ ప్లేటుపై అంకెలను ఫ్యాన్సీరీతిలో ముద్రించకూడదు. అంతేకాకుండా ఈ నెంబర్‌ ప్లేటుపై ఉన్న 1515 అంకెలు ఐఎస్‌ఐఎస్‌లాగా కనిపించేవిధంగా ఉండటంతో ఇది స్థానికంగా అనుమానాలు రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్ మద్దతుగా సదరు కారు యజమాని ఇలా నంబర్‌ప్లేటు రాయించి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లక్నోలోని నిషాంత్‌గంజ్‌  రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద శుక్రవారం సాయంత్రం ఈ కారు పార్కు చేసి ఉండగా ఇద్దరు వ్యక్తులు నంబర్‌ ప్లేటు చూసి విస్తుపోయారు. నంబర్‌ ప్లేటులో మొదట ఐఎస్‌ఐఎస్ అని కనిపించగా.. కాస్తా గమనించి చూస్తే ఫ్యాన్సీ నెంబర్ (UP 32 HA 1515)  కనిపించింది. ఇందులో ఐదుని ఇంగ్లిష్ అక్షరం ఎస్‌లాగా కనిపించేవిధంగా ముద్రించడంతో ఇది ఐఎస్‌ఐఎస్‌ అని కనిపిస్తోంది. ఇలా నంబర్‌ ప్లేటు రాయడం నిబంధనల విరుద్ధమని, అందుకే దీని యజమాని ఎవరు అన్నది ఆరా తీస్తున్నామని లక్నో ట్రాఫిక్ ఏఎస్పీ హబిబుల్ హసన్‌ తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Locknow police  RTA officials  Islamic State  Car registration plate  ISIS  Uttar pradesh  

Other Articles