Daughter beats 85-year-old mother, neighbours film the incident

Daughter brutally beats 85 year old mother video goes viral

woman beaten by daughter, daughter beats mother, viral video daughter beats mother, 85 year old mother beaten by 60 year old daughter, viral video, viral news

The video of a woman mercilessly beating her frail old mother is being widely shared on social media platforms, eliciting a lot of outrage among those who have seen it.

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్.. అవ్వపై అమ్మమ్మ ఇలా..

Posted: 05/24/2016 06:59 PM IST
Daughter brutally beats 85 year old mother video goes viral

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి ఆ కూతురు చేసిన మర్యాదను నెట్ జనులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 85 ఏళ్ల వృద్ధ తల్లిపై చేసుకున్న ఘటనను ఇప్పటికే పది లక్షల మంది వీక్షించారు. అంతేకాదు ఆ కర్కోటక కూతురు చేసిన ఘటనను తూర్పరబడుతూ కామెంట్లు చేశారు. 85 ఏళ్ల వయస్సులో తన కూతరు చేతిలో దెబ్బలు తీన్న ఆ మాతృమూర్తి ఎంత క్షోభను అనుభవించిందోనని మరికోంత మంది ఫీలయ్యారు. ఆ కూతరికి అంతలా కోసం రావడానికి కారణం ఏమిటో తెలయదు.. అంతకుముందు ఏమైందో ఏమో తెలియదుగానీ, తల్లి అన్న గౌరవం కూడా లేకుండా కూతురు ఆమెపై అనుచితంగా ప్రవర్తించింది.  

నిస్సహాయ స్థితిలో వున్న పెద్దావిడ పెద్దగా రోదిస్తున్నా..కనీసం జాలి చూపకుండా.. తల్లి పై పలుమార్లు చేయి చేసుకుంది.  చుట్టుపక్కల వారు చూస్తూ ఉండగానే మొఖంమీద, మూతిమీది  దాడిచేసింది.  డిల్లీలోని కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటు కూతురు కూడా (65) వయస్కురాలే. అమె కూడా పిల్లలను కని మనమళ్లు, మనమరాళ్లు కలిగినా.. తన వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. తల్లి అనికూడా చూడకుండా కఠినాత్మురాలిగా వ్యవహరించిన తీరును నైట్ జనులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

అయితే ఈ దాడిని  పొరుగు వారు ప్రశ్నించారు. తల్లిని అలా దండించడం తప్పని నిలదీశారు. దీంతోపాటుగా ఆ ఉదంతాన్ని మొబైల్  లో వీడియో తీసి  సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.  అనంతరం పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లిని కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిరాకరించిన తల్లి ఇది కుటుంబ సమస్యఅనీ, ఫిర్యాదు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేయడం విశేషం. కాగా చుట్టు పక్కల చిత్రీకరించిన ఈ వీడియోను ఫేస్  బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.  దాదాపు తొమ్మదిన్నర లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother  Daughter  Neighbour  films camera  elderly woman  viral video  

Other Articles