గులాబీ సీక్రెట్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ | komati reddy brothers and MP malla ready ready to jump

Komati reddy brothers and mp malla ready ready to jump

komati reddy brothers, TDP MP malla ready, TRS, కోమటిరెడ్డి బ్రదర్స్, ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్, latest political news, latest news, politics

komati reddy brothers and TDP MP malla ready ready to join in TRS

ITEMVIDEOS: గులాబీ సీక్రెట్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్

Posted: 05/30/2016 05:24 PM IST
Komati reddy brothers and mp malla ready ready to jump

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే సమీప భవిష్యత్తులో తమ పార్టీకి అసలు పోటీయే లేకుండా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి జెట్ స్పీడ్ తో మొత్తం టీడీపీని కనుమరుగు చేసి పారేశారు. ఇక ఆయన కళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పై పడ్డాయి. ప్రతిపక్ష హోదాలో ఉండటంతోపాటు కొన్ని జిల్లాలో తమకు పట్టు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ను మొత్తం ఖాళీ చేయించి ఎలాగైనా కారెక్కిచేలా పావులు కదుపుతున్నారు. మొండిపట్టుతో అసలు పార్టీ మారే ఉద్దేశం లేదని దృఢ నిశ్చయంతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను ముందుగా టార్గెట్ చేశారు.
                   
నల్లగొండ జిల్లాలో కీలకనేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కి టీఆర్ఎస్ లో చేరాల్సిన అవసర అస్సలు లేదు. పైగా తమకంటూ ప్ర్యతేకమైన ప్రజాబలంను ఏర్పరుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కోమట్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఓడిపోయినప్పటికీ, ఆపై జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీని తట్టుకోని గెలిచారు. ఇక ఎదురే లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోమటిరెడ్డికి తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన దీక్షతో క్రేజ్ మరింత పెరిగింది. ఆ కారణంతోనే టీఆర్ఎస్ పై అలవోకగా విజయం సాధించారు. గతంలో ఎన్నోసార్లు వీరిద్దరు పార్టీ మారతారనే వార్తలు వచ్చినప్పటికీ బహిరంగంగానే వారు వాటిని ఖండిస్తూ వచ్చారు.  పార్టీ తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న వీరు ఎట్టకేలకు పార్టీ మారితేనే బావుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో కాస్త వెనకడుగు కనిపిస్తున్నప్పటికీ, వెంకట్ రెడ్డి మాత్రం పక్కా చేరుతారని అనుచరులు చెబుతున్నారు.  అంతేకాదు ఓ వారం క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సీక్రెట్ సిట్టింగ్ వేసి ఆయన చేరిక కోసం గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారంట. అయితే జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కోమట్ రెడ్డి చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, పార్టీ బలోపేతం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారంట.

ఇక వీరే కాదు, తెలంగాణలో టీడీపీ కి మిగిలిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. అభివృద్ధి పనులు జరగాలన్న, తన రాజకీయ భవిష్యత్ ముందుకు సాగాలన్న పార్టీ మారటమే కరెక్టన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లేదా ఓ ప్రత్యేక ముహుర్తాన వీరంతా టీఆర్ఎస్ లో చేరటం ఖాయమైపోయింది. తెరవెనుక జరిగిన ఇంత భాగోతానికి కర్త, కర్మ, క్రియ ఎవరో తెలుసా? స్వయానా కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ మంత్రి హరీష్ రావు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : komati reddy brothers  TDP MP malla ready  TRS  

Other Articles