Controversial Arms Dealer Was Proxy-Owner Of Robert Vadra's London Home

Inquiry links arms dealer to benami london home for robert vadra

Robert Vadra, scams, congress, india-intelligence-bureau, black money, India black money, Sonia Gandhi, Defence dealer Sanjay Bhandari, Manoj Arora, Robert Vadra London house,

The finance ministry is reviewing an investigative report submitted by enforcement and tax officials that says an arms dealer had fronted for Robert Vadra in 2009 when he bought a mansion in London.

వాద్రా బినామి గుట్టు బయటపడిందిలా..!

Posted: 05/30/2016 07:37 PM IST
Inquiry links arms dealer to benami london home for robert vadra

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా బండారం కూడా బట్టభయలైంది. ఓ ఆయుధాల డీలర్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు సదరు డీలర్‌ను బినామీగా పెట్టుకొన్న వాద్రా లండన్‌లో ఆయన పేరునే పెద్ద భవనాన్ని (మాన్షన్‌) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఫైల్‌ను ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమీక్షిస్తోంది.
 
గత నెలలో ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారికి చెందిన 17 నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్ మెంట్ సంస్థలు దాడులు నిర్వహించాయి. సంజయ్‌కి, వాద్రాకు ఉన్న సంబంధాలపై ఈ దాడుల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాద్రా, అతని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌ మనోజ్ అరోరా.. భండారికి పంపిన ఈమెయిల్స్‌, విచారణలో భండారి తెలిపిన వివరాలు దర్యాప్తు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. లండన్‌ బ్రియాన్‌స్టన్‌లోని ఎల్లెర్టన్‌ హౌస్‌ రూ. 19 కోట్లకు కొనుగోలు చేయగా.. దాని చెల్లింపులు, అదనపు హంగులు చేకూర్చే విషయమై ఈ ఈమెయిల్స్‌లో వాద్రా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వాద్రా లాయర్లు మాత్రం ఈ అంశాలను తిరస్కరిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles