నగ్నత్వం అనేది ఒకప్పుడు మనదేశంలో గుళ్లో బొమ్మలపై మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు దానర్థం పూర్తిగా మారిపోయింది. యువత ఆ టాపిక్ ఎత్తితే చాలూ సిగ్గుతో ముడుచుకుపోతారు. సినిమాల్లో కాస్త ఎక్స్ పోజింగ్ కనిసిస్తే సెన్సార్ కట్ లు, సెలబ్రిటీలు వల్గర్ గా ఫోజులిస్తే దెప్పిపొడవడానికి మహిళా సంఘాలు రెడీగా ఉంటున్నాయి. న్యూడిటీ గురించి మాట్లాడినా అసలు ఆ ఐసెత్తిన అదోక నేరంగా మారిపోయింది, కానీ, ఈ రోజు మీకోసం ఓ భారతీయ నారిని పరిచయం చేయబోతున్నాం. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా? నగ్నంగా సైకిల్ తొక్కిన రికార్డును ఆమె సొంతం చేసుకుంది. అందుకోసం ఆమె చెప్పిన కారణం మానవత్వం, పర్యావరణ పరిరక్షణ.
లండన్ లో నివసిస్తున్న మీనాల్ జైన్ ఓ ఐటీ కంపెనీ నడుపుతోంది. పుట్టినప్పుడు, పోయేప్పుడు లేని ఈ గుడ్డల గొడవ నడుమ మాత్రం ఎందుకనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతోంది. బీచ్ ల్లో కూడా చాలా సార్లు పూర్తి నగ్నంగా ఆమె తిరిగిన రోజులున్నాయంట. అంతేనా లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ ను కూడా నడుపుతూ నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. ఇక మెల్ బోర్న్ లో పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన నగ్న ర్యాలీ ఆమెకు స్వేచ్ఛనిచ్చింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా సైకిల్ ర్యాలీలో పాల్గొని ఆ ఫీట్ ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డుకెక్కింది. విమర్శలను పక్కనబెట్టి మా శరీరం... మా ఇష్టం అంటూ ఇంత ఓపెన్ గా ఉండే మహిళలు, పైగా భారత దేశం లాంటి కట్టుబాట్లు, పద్ధతులు ఉన్న దేశం నుంచి ఎంత మంది ఉంటారు చెప్పండి. అన్నట్లు ఈ సందర్భంలో ప్లే బాయ్ పై తన నగ్నత్వాన్ని ప్రదర్శించి మెప్పుపొందిన షెర్లిన్ చోప్రాను గుర్తుచేసుకోకుండా ఎలా ఉంటాం. ఇలాంటి నగ్న నారీమణులకు ఓ హాట్సాఫ్ కొట్టడం తప్పించి మనం చేసేది ఏం ఉంటుంది చెప్పండి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more