Giant alligator panics golfers as it ambles across course in Florida

Massive alligator spotted again on florida golf course

alligator Goliath, Myakka Pines Golf Course, Charlie Helms, Englewood, Two people seen alligator, alligator roaming the course, alligator seen earlier this month, club's general manager alligator,

The alligator, apparently named "Goliath," was seen eating a turtle on Thursday morning at the Myakka Pines Golf Course in Englewood, Florida, according to the club's Facebook page.

ITEMVIDEOS: గోల్ఫ్ కోర్సులో అనూహ్య అతిథి..

Posted: 06/02/2016 02:00 PM IST
Massive alligator spotted again on florida golf course

యధావిధిగా తమ సెలవు రోజున స్నేహితులతో కలసి గోల్ప్ అడుదామని వెళ్లిన ఫ్లోరిడా నివాసి చార్లీ హెల్మ్స్ అవాక్కయ్యాడు. తన స్నేహితులతో కలసి గోల్ఫ్ కోర్స్ కు వెళ్లిన.. తమకంటే ముందే అక్కడికి వచ్చిన అతిథిని చూసి వాళ్లు విస్మయానికి గురయ్యారు. ఎక్కడో అభయారణ్యంలో సంచరించాల్సిన ఎలిగేటర్ తమ గోల్ప్ కోర్సులో దర్శమివ్వడం.. అందులోనూ సుమారుగా 15 అడుగులకు పైబడిన భారీ మృగాన్ని చూడటంతో నోళ్లు వెళ్లబెట్టారు. మొసలి జాతికి చెందిన ఎలిగేటర్ దర్జాగా బఫెలో క్రీక్ గోల్ఫ్ కోర్స్ లో దర్జాగా చక్కర్లు కొట్టింది. నమ్మశక్యంకాని ఈ దృశ్యాన్ని చార్లీ హెల్మ్స్ తన కెమెరాలో బంధించాడు.

అంతేకాకుండా మే 25న తన ఫేస్బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ లోనూ షేర్ చేశాడు. ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను 5 రోజుల్లోనే 40 లక్షల మంది వీక్షించడం విశేషం. గోల్ఫ్ కోర్స్ లోని ప్రతి అంగుళం తనకు తెలుసు అన్నట్టుగా ఎలిగేటర్ కలియదిరిగినట్టు వీడియోలో ఉంది. 'జూరాజిక్ పార్కు'లో సీన్ చూసినట్టుగా ఉంది. మరోవైపు ఎలిగేటర్ చూసి భయపడకుండా దాన్ని వీడియోలో బంధించిన చార్లీ హెల్మ్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా గతంలో కూడా ఇదే గోల్ప్ కోర్సులో 12 నుంచి 13 అడుగుల గల ఎలిగేటర్ సంచరించడాన్ని తాము చూశామని ఇద్దరు వ్యక్తులు తమకు చెప్పినట్లు కోర్సు జనరల్ మేనేజర్ చెప్పడం కూడా గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alligator  Goliath Englewood  Florida  Golf Course  Charlie Helms  

Other Articles