జైపాల్ రెడ్డి మాటలు వింటున్నారా? | jaipal reddy criticize KCR and his policies

Jaipal reddy criticize kcr and his policies

congress senior leader, jaipalreddy, KCR, కాంగ్రెస్, జైపాల్ రెడ్డి, తెలంగాణ, కేసీఆర్, రెండేళ్ల పాలన, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, latest news, telangana news, telugu news

congress senior leader jaipalreddy criticise KCR and his policies.

జైపాల్ రెడ్డి మాటలు వింటున్నారా?

Posted: 06/02/2016 03:22 PM IST
Jaipal reddy criticize kcr and his policies

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మంచి వ్యాపారి అని, లాభం ఉంటే తప్పా ఎవరినీ పొగడరని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కడిదే కాదని ఆయన చెబుతున్నారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అసలేం సాధించాడని ఉత్సవాలు జరుపుతున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి వ్యక్తితో రహస్య మంతనాలు జరుపుతున్నారు. దాని వల్ల ఎవరికి లాభం, ఏం లాభం అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారంటూ ఆరోపించారు.

అసలు కేసీఆర్ తెలంగాణ సాధించాడని ఎందుకు చెప్పుకుంటున్నాడో అర్థం కావట్లేదని చెప్పారాయన. ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్షని, నిమ్స్ లో చికిత్స తీసుకున్న ఆయన  రోజూ 750 కేలరీల టోటల్ పెరటల్ న్యూట్రిషన్ ఇంజక్షన్లు తీసుకున్నారని, ఇదంతా నిమ్స్ రికార్డుల్లో ఉందని ఆరపించారు. పచ్చి అవకాశవాది అని అయిన కేసీఆర్ రాష్ట్రం ప్రకటించగానే సోనియాను, కాంగ్రెస్ ను పొగడ్తలతో ముంచాడని, ఇప్పుడు ఫిరాయింపులతో కాంగ్రెస్ ను ముంచాలని చూస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా ఏకంగా కీలకమైన కేబినెట్ మంత్రిగా ఉండి తెలంగాణ కోసంగానీ, అందుకోసం బలిదానం చేసుకున్న వారికోసం ఏనాడూ పన్నెత్తి మాట్లాడని ఆయన ప్రస్తుతం మాట్లాడే మాటలు పార్టీకి గానీ, అధిష్ఠానానికి గానీ ఊరటనిస్తుందనుకోవటం భ్రమే అవుతుంది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress senior leader  jaipalreddy  KCR  telugu news  

Other Articles