Brilliant father's wife replace breastfeeding her new daughter in Florida

New dad finds an innovative way to breastfeed his daughter

Brilliant father, substitute wife, breastfeeding her new daughter, Florida, Chris Allen, video, facebook, mother at work, breastfeed, crazy dad, Tshirt,

Brilliant father's wife replace breastfeeding her new daughter in Florida, Chris Allen, from Florida, has found a way to 'breastfeed' his daughter, The method basically entails pushing a bottle through a T-shirt hole

ITEMVIDEOS: చంటిపాపకు తండ్రి చనుపాలు..

Posted: 06/04/2016 08:56 AM IST
New dad finds an innovative way to breastfeed his daughter

చంటిపిల్లలు ఎవరి వద్దనుంటారు అంటే చటుక్కున చెబుతాం అమ్మ ఒడిలో అని. ఎందుకంటే అంతకన్నా హాయినిచ్చే ఆలయమే వారికి వుండదు కాబట్టి. నెలలు నిండేకొద్ది తండ్రి వద్దకు వెళ్తుంటారు. అది కూడా తమ కడుపు నిండితేనే. లేదంటే మళ్లీ అమ్మ ఒడికి చేరేదాక గుక్కపెట్టి ఏడుస్తుంటారు. అందుకు అడ్డుకట్ట వేశాడు ఫ్లోరిడాకు చెందిన ఓ తండ్రి, తన బిడ్డకు అన్ని తానే అనేలా చేశాడు క్రిస్ అల్లెన్. మరోలా చెప్పాలంటే తండ్రి అనే పదానికి అర్థాన్ని చూపించాడు.

చంటిబిడ్డల కోసం తల్లులు ఎంతో శ్రమించి అదంతా కేవలం తమ బిడ్డ కడుపు నిండగానే అడగానే మర్చిపోతారని తెలిసి.. కేవలం తల్లులే కాదు తండ్రులకు కూడా పసిపాపలు అంటే చాలా ఇష్టమని.. వారు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో ఉంటారని నిరూపించాడు. అసలు విషయం ఏంటంటే.. క్రిస్ అల్లెన్, జెన్నిఫర్ కాపో భార్యాభర్తలు. అయితే జెన్నిఫర్ ఉద్యోగం చేస్తోంది. కుటుంబాన్ని పోషించాలంటే ఎవరో ఒకరు జాబ్ చేయక తప్పని పరిస్థితి. వీరికి నెలల పాప ఉంది. భార్య జెన్నిఫర్ ఇంటి పట్టాన ఉండటం వీరి ఇంట్లో కుదరదు. అందుకే తన పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.
 
ఎంత ప్రేమగా చూసుకున్నా, చిన్నారికి పాలివ్వాల్సి రావడం కాస్త సమస్యగా మారింది. దీనికి ఓ సొల్యూషన్ ఆలోచించాడు. పాపకు పాలిచ్చే సమయంలో అతడు టీషర్ట్ వేసుకుని దానికి పాల పీపా పట్టే అంతటి రంద్రాన్ని చేశాడు. తల్లులు పాలిస్తున్నట్లే తన పాపను ఒడిలో పెట్టుకుని, ఇంకా నిల్చున్నప్పుడు కూడా టీషర్ట్ లోపల పాలు నింపిన పీపాను పెట్టి చిన్నారికి పాలు ఇవ్వడం చేస్తున్నాడు. ఇక చిన్నారి ఏడవడం అనేది లేకుండా పాలిచ్చి, జోకొడుతూ పాపను తండ్రి క్రిస్ అల్లెన్ నిద్రపుచ్చుతుంటాడు. భార్య ఇంటికి వచ్చే వరకూ అలా చిన్నారి ఆలనాపాలనా బాధ్యతలు స్వీకరించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles