కోమటిరెడ్డి హింట్ ఇచ్చేశాడోచ్! | Komatireddy fires on PCC cheif Uttam Kumar Reddy

Komatireddy fires on pcc cheif uttam kumar reddy

Nalgonda MLA, MLA Komatireddy, PCC cheif, PCC cheif Uttam Kumar Reddy, congress party, నల్గొండ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, latest news, telugu news, telangana news, political news

Nalgonda MLA Komatireddy fires on PCC cheif Uttam Kumar Reddy. seniors lost control in party. high command immediately changed that position. hint about party change.

కోమటిరెడ్డి హింట్ ఇచ్చేశాడోచ్!

Posted: 06/04/2016 04:06 PM IST
Komatireddy fires on pcc cheif uttam kumar reddy

గులాబీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో కొద్దిరోజులగా మీడియాకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఎట్టకేలకు పెదవి విప్పాడు. శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆయన పార్టీ మారే అంశం నేరుగా ప్రస్తావించకుండా సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత అధ్యక్షుడు పొన్నాల కంటే ఉత్తమ్ అసమర్థుడంటూ వ్యాఖ్యానించాడు. సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరుడి ఓటమికి ఉత్తమ్ చేసిన రాజకీయాలే కారణమంటూ ఆరోపించారు.

పార్టీ ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి. నాయకత్వం సరిగ్గా లేకపోవటం మూలంగా మిగతా నేతలు ఉపఎన్నికలను పట్టించుకోలేదు. అందుకే ఓటమి పాలైందంటూ చెప్పుకొచ్చాడు. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ల ద్వారా పార్టీకి ఒరిగేదేం లేదని, నేతలంతా ఈవిషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బాగుపడాలంటే కాంగ్రెస్ కు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే పోస్ట్ మార్టమే మిగులుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్లంతా ఎవరికి వారే తదుపరి సీఎం అభ్యర్థులమంటూ ఫీలయిపోతున్నారు. ఆ విషయంలో కూడా అధిష్టానం ఓ స్పష్టత ఇస్తే మంచిదంటున్నారు.

అయితే ఇంత మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ లో చేరికపై దాటవేత ధోరణి ప్రదర్శించారు. మీడియా ఆ ప్రశ్న అడగబోతుందని ఊహించిన ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ, మీడియాతో ఆయన మాట్లాడిన విషయాలను పరిశీలిస్తే మాత్రం ఒక్క విషయం అర్థమౌతుంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి పనితీరు బాగోలేదని విమర్శించిన ఆయన,  ఉద్యమంలో పాల్గొన్న వారిని నియమించాలని వ్యాఖ్యానించడంతో ఆ పదవిపైనే కన్నేశారని అర్థమౌతోంది. ఒకవేళ పార్టీ గనక అందుకు సుముఖంగా లేకపోతే అప్పుడు గులాబీ కండువా కప్పేసుకుంటారని ఆయన అనుచరులు చెప్పకుంటున్నారు. మరి కోమటిరెడ్డి ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ కి కాంగ్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nalgonda MLA  MLA Komatireddy  PCC cheif  PCC cheif Uttam Kumar Reddy  congress party  

Other Articles