మోదీకి అమీర్ ఖాన్ అవార్డు! | modi honoured with Amir Amanullah Khan Award

Modi honoured with amir amanullah khan award

Prime Minister Narendra Modi, Afghanistan’s highest civilian honour, Amir Amanullah Khan Award, Ashraf Ghani, modi afghan tour, తాజావార్తలు, తెలుగు వార్తలు, మోదీ న్యూస్, మోదీ అమీర్ ఖాన్ అవార్డు, రాజకీయ వార్తలు, modi news, latest news, political news

Prime Minister Narendra Modi was on Saturday conferred with Afghanistan’s highest civilian honour, the Amir Amanullah Khan Award. Afghan President Ashraf Ghani conferred the award on Narendra Modi after the two leaders jointly inaugurated the Afghan-India Friendship Dam, earlier known as Salma Dam, that was rebuilt with India’s aid.

మోదీకి అమీర్ ఖాన్ అవార్డు!

Posted: 06/04/2016 05:16 PM IST
Modi honoured with amir amanullah khan award

ఏంటీ? ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పేరుతో ఓ అవార్డును నెలకొల్పటం, అప్పుడే దానిని ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరించడం జరిగిపోయాయని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ప్రస్తుతం మన ప్రధాని ఐదు దేశల పర్యటనలో ఉన్నారని తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు అఫ్ఘనిస్థాన్ చేరుకున్నారు. అక్కడ ఆఫ్ఘన్‌-భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆమీర్‌ అమానుల్లా ఖాన్‌ పురస్కారాన్ని మోదీకి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అవార్డు అందుకుంటున్న ఫొటోను విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 'నిజమైన సోదరభావానికి లభించిన గౌరవం ఇది. అఫ్ఘానిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ఆమిర్ అమానుల్లా ఖాన్ అవార్డు ప్రధాని మోదీకి లభించిందంటూ సందేశాన్ని ఉంచారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles