B-town mourns death of veteran actress Sulabha Deshpande

Veteran actor sulabha deshpande dies at 79

sulabha deshpande, pallavi joshi sulabha deshpande, Madhur Bhandarkar, Madhuri Dixit, Sonu Nigam, Richa Chadha, Raveena Tandon, Lata Mangeshkar, sulabha deshpande dead, sulabha deshpande dies, sulabha deshpande news, sulabha deshpande works, sulabha deshpande serials, 1987 Sangeet Natak Akademi Award, Arvind Deshpande, InMemoriam, entertainment news

Veteran Bollywood and Marathi cinema, stage and television actress and director Sulabha Deshpande passed away in Mumbai

సీనియర్ నటి కన్నుమూత.. అలుముకున్న విషాధఛాయలు

Posted: 06/05/2016 11:24 AM IST
Veteran actor sulabha deshpande dies at 79

బాలీవుడ్ సీనియర్ నటి శులభ దేశ్పాండే ముంబైలోని స్వగహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ గతరాత్రి మరణించినట్టు అమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరాఠీ, హిందీ సినిమా రంగాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అక్రమించిన అమె మరణంతో బాలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగారు. ఇటు మరాఠీ సినీ పరిశ్రమ కూడా విషాధఛాయలు అలుముకున్నాయి. అమె మృతి పట్ల పలువురు బాలీవుడ్, మరాఠీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

బాలీవుడ్ సినీనిర్మాత మధుర్ బండార్కర్ శులభ దేశ్ పాండే మృతి వార్త తమను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. అమె మరాఠీ నాటకరంగానికి, హిందీ చలనచిత్ర రంగానికి అందించిన సేవలను  తాము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామన్నారు. అలనాటి హీరోయిన్లు మాధురీ దీక్షిత్, రవీనా టాండన్ లు కూడా అమె మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమె చాలా అత్మీయురాలని, దాంతో పాటు బహుచక్కని నటి అని కోనియాడారు. వీరితో పాటు నటి రిచా చద్దా, టీవీ నటి పల్లవీ జోషీ తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అటు సోను నిగమ్, లతా మంగేష్కర్ కూడా శులభ దేశ్ పాండే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా అమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమె కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 79 ఏళ్ల శులభ పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్తో కలసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్పాండేతో కలసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. అరవింద్ దేశ్పాండే 1987లో మరణించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1987 Sangeet Natak Akademi Award  Arvind Deshpande  InMemoriam  Sulabha Deshpande  

Other Articles