World's Muslims mark beginning of Ramadan

World s muslims mark beginning of ramadan

ramadan, ramzan, holy month, dawn to dusk fasting, intense prayer, mecca masjid, muslims hloy month ramzan, begining of new moon, middle east countries, india, pakistan, bangladesh, mosques, spirituality, Quran, charity, good deeds, iftar parties, haleem

The Muslim holy month of Ramadan will begin on Monday for most of the world's 1.2 billion Muslims.

నెలవంక దర్శనం.. ప్రారంభమైన పవిత్ర మాసం..

Posted: 06/06/2016 08:52 AM IST
World s muslims mark beginning of ramadan

ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్... ప్రారంభమైంది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదు వద్ద నెలవంక దర్శనమివ్వడంతో ఆ మసీదు మత పెద్దలు అదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. గల్స్ దేశాలలో నిన్న రాత్రి నుంచే రంజాన్ మాసం ప్రారంభమైందని పెద్లలు ప్రకటించారు. ఈ సమాచారంలో ఇక భారత్ సహా అన్ని ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న మహ్మదీయ సోదరులు రంజాన్ మాసాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు.

రంజాన్ మాసం నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మహ్మదీయ సోదరులు పవిత్ర మాసానికి సంబంధించి ఉపవాస దీక్షలు కూడా మొదలైపోయాయి. రంజాన్ మాసం ప్రారంభానికి సూచకంగా నెలవంక దర్శనం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ముస్లిం సోదరులకు నిన్న సౌదీ అరేబియాలో ఆ నెలవంక కనిపించేసింది. నెల రోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలను ఆచరించనున్న ముస్లింలు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత మాత్రమే భుజిస్తారు. మంచి నీళ్లు సైతం తాగకుండా అత్యంత భక్తిశ్రద్దలతో ముస్లింలు ఈ రంజాన్ పండుగను చేసుకుంటారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramadan  ramzan  holy month  dawn to dusk fasting  intense prayer  mecca masjid  begining of new moon  

Other Articles