రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదా? | IGNCA chief says ambedkar just changed language of constitution

Ignca chief says ambedkar just changed language of constitution

Ram Bahadur Rai, IGNCA chief, comments on ambedkar, Ram Bahadur Rai ambedkar, comments on ambedkar, ambedkar changed language of constitution, తాజా వార్తలు, తెలుగు వార్తలు, అంబేద్కర్, రాజ్యాంగాన్ని భాష మార్చాడు, రామ్ బహదూర్ రాయ్, బీజేపీ, మోహన్ భగవత్, latest news

Ram Bahadur Rai, newly appointed chairman of the Indira Gandhi National Centre for the Arts, has stirred a controversy by allegedly questioning Dalit icon B R Ambedkar’s contribution to the Constitution and terming it “a myth”.

రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదా?

Posted: 06/08/2016 09:47 AM IST
Ignca chief says ambedkar just changed language of constitution

భారత రాజ్యాంగ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని రూపొందించింది ఎవరంటే టక్కున అంబేద్కర్ అని చెప్పేస్తారు. వివిధ దేశాల రాజ్యాంగాలను, అందులోని చట్టాలను అధ్యయనం చేసి దాదాపు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రూపుదిద్దారు. కానీ, ఇక్కడో జర్నలిస్ట్ దిగ్గజం మాత్రం అసలు రాజ్యాంగాన్ని రాసింది అంబేదర్కర్ కాదని తీవ్ర దుమారమే రేపాడు. ఏబీవీపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తాజాగా ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చైర్మన్ గా నియమితులైన రామ్ బహదూర్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్నే రాయలేదని, వేరే వ్యక్తులు రాసిన రాజ్యాంగంలో భాషను అంబేద్కర్ కేవలం సరిచేశారంటూ ఈ ప్రముఖ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆయన రాజ్యాంగాన్ని రూపొందించాడు అనుకుంటే అది భ్రమే అవుతుంది. అందులో ఆయనది కేవలం పరిమితమైన పాత్ర, మొత్తం క్రెడిడ్ అంబేద్కర్ దే అనుకుంటే పొరపాటు, అది ఒక అపోహా మాత్రమే అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా, రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ దళిత విభాగం దళిత మోర్చా భగ్గుమంది. మోదీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా రాయ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దళిత మోర్చా నేత దుశ్యంత్ కుమార్ గౌతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాయ్ తానసలు ఆ వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నాడు. బీహార్ ఎన్నికల్లో దళిత రిజర్వేషన్లకు అనుకూలంగా బీజేపీ హామీ ఇవ్వటంతోనే ఓటమిపాలైందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన వెంటనే ఇలా రాయ్ అంబేద్కర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం విశేషం.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Bahadur Rai  IGNCA chief  comments on ambedkar  

Other Articles