When A Game Of Baseball In Japan Turned Into A Nightmare

The ring and the grudge ghouls just faced off at a baseball game

japan, sadako, kayako, Ghost, game, baseball, Sadako vs Kayako, The Ring, The Grudge, Hokkaido Nippon-Ham Fighters, Tokyo Yakult Swallows, Nippon Professional Baseball, horror, horror movies, the ring, ring, the grudge, ringu

Two of Japan's most iconic ghosts – Sadako and Kayako - battled it out on the baseball mound in Japan earlier this month to promote upcoming film, "Sadako vs Kayako."

ITEMVIDEOS: ఆ మ్యాచ్లోకి దెయ్యాలు.. బెంబేలెత్తిన చీర్ లీడర్లు..

Posted: 06/08/2016 11:22 AM IST
The ring and the grudge ghouls just faced off at a baseball game

ఆ మధ్య విదేశాలలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ అడుతున్న క్రమంలోనే తెల్లటి ఆకారాలతో అటగాళ్ల వెనుక పరుగెత్తి.. క్రీడాకారుల మజాను పోందాలని భావించిన దెయ్యాలు.. ఆ మాజాను తీర్చుకున్నాయి. అయితే ఆట మధ్యలోకి వెళ్లకుండా ఏదో గ్రౌండ్ సరిహద్దులో అలా తమ కోరికను తీర్చుకున్నాయి. అయితే జపాన్ లో మాత్రం బేస్ బాల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే వచ్చిన దెయ్యాలు బాగా తెలిసినట్టుగా బేస్ బాట్ గేమ్ అడేసాయి. అంతటితో అగకుండా ఏకంగా పరుగులు కూడా చేశాయి.

ఈ ఉదంతాన్ని కిక్కిరిసన స్టేడియంలో వందలాది అభిమానుల మధ్య జరిగింది. కాగా కళ్లారా చూసిన చీర్ లీడర్లు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. తామెదో ఆటలోని మజా రెట్టింపయ్యేలా అద్భుత నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేయడానికి వస్తే.. ఈ దెయ్యాల గొడవేంట్రా బాబు అనుకున్నారో ఏమో ఏకంగా తమకు కేటాయించిన ప్రాంతా నుంచి పారిపోయారు. తమవైపు దూసుకువస్తోన్న వికృత రూపాలను చూసి వణికిపోయారు. ఆ మ్యాచ్ వారికి పీడకల. అవునుమరి, పచ్చినెత్తురు తాగే పిశాచాలు గ్రౌండ్ లోకి చొరబడితే ఎవరు మాత్రం ఎదుర్కోనగలరు.

అయితే చీర్ లీడర్స్ ను ఆ తరువాత జరిగే బేస్ బాల్ ఫోటీల కోసం నిర్వాహకులు బతిమాలి, బామాలి తీసుకోచ్చారు. అయినా పిశాచాలు వున్నాయంటే మళ్లీ ఎలా వచ్చారనేగా,? ప్రాణం కన్నా మ్యాచ్ గొప్పదా.? అనేగా మీ డౌట్. అయితే చీర్ లీడర్లకు నిర్వాహకులు అసలు విషయాన్ని చెప్పారు. అదేంటి అనుకుంటున్నారా.. జపాన్ లో త్వరలో విడుదల కానున్న చిత్రం సుడాకో వర్సస్ కయాకో ప్రమోషన్ లో భాగంగా చిత్ర నిర్మాణ సంస్థ ఇలా బేస్ బాల్ టార్నమెంటును వేదికగా చేసుకున్నారట. అసలు విషయం తెలియడంతో చీర్ లీడర్లు మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టారు. నిప్పొన్ హ్యామ్ ఫైటర్స్, యాకుల్ట్ స్వాలో జట్ల మధ్య జరగాల్సిన అసలు మ్యాచ్ కు ముందు ఈ దయ్యాల క్యారెక్టర్లు ఆడిన ఈ ఆట తాలూకు వీడియోకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  sadako  kayako  baseball  Ghost  game  

Other Articles