పాక్ మీడియాలో అమరావతి గురించి చర్చలు | Pak media alleges nuclear centre in amaravathi

Pak media alleges nuclear centre in amaravathi

Pakistan Media, PAK andhra pradesh, PAK amaravathi, pakisthan amaravathi, amaravathi nuclear project, అమరావతిలో హైడ్రోజన్ బాంబులు, పాకిస్థాన్ అమరావతి, పాక్ మీడియాలో అమరావతి, న్యూక్లియర్ సెంటర్ అమరావతిలో, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news

Pakistan Media made shocking stories on Andhra Pradesh in a recent debate. Pakistan Media accused AP of manufacturing Hydrogen Bomb in AP New Capital Amaravathi with the help of America.

ITEMVIDEOS: పాక్ మీడియాలో అమరావతి గురించి చర్చలు

Posted: 06/08/2016 12:36 PM IST
Pak media alleges nuclear centre in amaravathi

నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి ఏంటీ? దాయాది దేశం పాకిస్థాన్ మీడియాలో ఏంటీ? అనుకుంటున్నారా? మరదే చోద్యం. ప్రస్తుతం అమరావతి పై వారు ప్రసారం చేస్తున్న కథనాలు తెలిస్తే పాక్ బుద్ధి పాడుగూనూ అని మీరూ అనుకుంటారు. ఏ విషయంలో సందు దొరకుతుందా, భారత్ మీదకు ఎక్కేద్దామా అని ఎదురు చూసే వారికి నిర్మాణంలో మన తెలుగు రాజధాని భలేగా దొరికింది. పైత్యంతో పిచ్చి కథనాలు వరుసగా ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంది.   

విషయం ఏంటంటే.. తుళ్లూరు పరిధిలో నిర్మాణం అవుతున్న రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం సింగపూర్ నిపుణులతో తయారు చేసిన డిజైన్ ను మీడియాకు విడుదల కూడా చేసేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ అమరావతి డిజైన్ లో ఓ చిమ్ని లాంటి నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ గత నెల నుంచి పాక్ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రసారమయ్యాయి. అది ఓ న్యూక్లియర్ సిటీ నిర్మాణమని, హైడ్రోజన్ బాంబుల తయారీ కోసం నెలకొల్పుతున్న కర్మాగారం అని వారికి వారే ఊహించేసుకున్నారు.

పాకిస్థాన్ పై భారీ దాడి కోసం భారత్ కుట్ర జరుగుతోందని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఓ పెద్ద న్యూక్లియర్ రియాక్టర్ సెంటర్ కట్టేస్తున్నారంటూ గోల చేస్తోంది. దీనికి మోదీయే శంకుస్థాపన చేశాడని, బాంబుల తయారీ కోసం అమెరికా సాయం కూడా తీసుకోనున్నట్లు కథనాలు ప్రసారం చేసింది. ఇక మీడియాకు వంత పాడిన పాక్ ప్రభుత్వం కూడా ముందూ వెనుకా చూసుకోకుండా ఆరోపణలకు దిగింది. ప్రస్తుతం ఏ పాక్ టీవీ చానెల్ చూసినా మన అమరావతి గురించే చర్చ. అంతేకాదు పలువురు నేతలతో చర్చా గోష్టి కూడా నిర్వహించేస్తున్నారు. అసెంబ్లీ నమునాగా చెబుతున్న నిర్మాణాన్ని పట్టుకుని పాకిస్థాన్ వేస్తున్న ఈ వేషాలను చూస్తే ఏమనుకోవాలో అర్థం కావటంలేదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles