దాష్టీకం: కట్టేసి రేప్ చేస్తూ వీడియో తీశాడు | superintendent arrested over rape and filmed hostel girls

Superintendent arrested over rape and filmed hostel girls

superintendent, children’s home, warden Rape, sexually assaulted, delhi hostel warden, rape and filming, తాజా వార్తలు, తెలుగు వార్తలు, వార్డెన్ రేప్, సూపరిండెంట్ రేప్ వీడియో, చిన్నారులపై వార్డెన్ రేప్, లైంగిక దాడి, జాతీయ వార్తలు, latest news, telugu news

The superintendent of the children’s home in Lajpat Nagar, who was arrested on charges of rape on Tuesday night for allegedly sexually assaulted over 12 girls aged between 8 and 10 years, shot videos of the act and photographed them.

దాష్టీకం: కట్టేసి రేప్ చేస్తూ వీడియో తీశాడు

Posted: 06/09/2016 01:15 PM IST
Superintendent arrested over rape and filmed hostel girls

అతడు చేయాల్సిన పని తండ్రిలా ఆ పిల్లలకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. కానీ, అసలు స్వరూపం చూస్తే మాత్రం ఓ మానవ మృగం. కంటికి రెప్పలా కాపాల్సిన వాడే రాక్షసుడిలా మారి చిన్నారులపై వికృతాలకు పాల్పడ్డాడు. 10 ఏళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని 12 మంది పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని ఓ బాలికల సంరక్షణాలయంలో వార్డెన్ గా పని చేస్తున్నా మీనా అనే కామాంధుడు. గత గురువారం తనిఖీల పేరుతో బాలికలు ఉండే హస్టల్ కు వచ్చాడు. అక్కడి సంరక్షకురాలిని బయటికి పంపించి బాలికలపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఒక్కోక్కరిని లోపలికి పిలిచి ఆరుగురిపై అత్యాచారం చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి చెప్పరాని ప్రదేశాల్లో కొడుతూ తీవ్రంగా హింసించాడు. అదంతా తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు కూడా. ఆపై ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయాడు. తిరిగొచ్చిన సంరక్షకురాలికి పిల్లలంతా అదోలా ఉండటంతో ఆరాతీసింది. దీంతో పిల్లలంతా జరిగింది పూసగుచ్చినట్లు చెప్పారు. ఆ వెంటనే ఆమె విషయాన్ని చైల్డ్ వెల్పేర్ కమిటీకి ఫిర్యాదు చేయటంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.

వారంత ఇన్ ఫెక్షన్ కి గురికావటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, సీడబ్ల్యూసీ ఉత్తర్వులతో కదిలిన పోలీసులకు విచారణలో ఆ వార్డెన్ గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. మరో ఆరుగురిపై ఇదే రీతిలో లైంగిక దాడికి పాల్పడటంతోపాటు, వారిని అమ్మకానికి కూడా సిద్ధం చేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో ఉద్యోగం ఉడటంతోపాటు మంగళవారం రాత్రి మీనాను అరెస్ట్ చేశారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi hostel warden  rape and filming  children’s home  

Other Articles