అనుపమ చేతిలో మంత్రి సెక్స్ టేప్? | Minister Parameshwara Naik sex tape at Anupama Shenoy

Minister parameshwara naik sex tape at anupama shenoy

Anupama Shenoy, DSP Anupama Shenoy, Anupama Shenoy Parameshwara Naik, Parameshwara Naik sex tape, Labour Minister Parameshwara Naik, Anupama Parameshwara Naik, తాజా వార్తలు, అనుపమ చేతిలో మంత్రి సెక్స్ టేప్, మంత్రి పరమేశ్వర నాయక్, మంత్రి సెక్స్ టేప్, కర్ణాటక రాజకీయాలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, రాజకీయ వార్తలు

Anupama Shenoy IPS claimed that she has an audio recording of Labour Minister Parameshwara Naik threatening her and a video of the minister's alleged love affair.

అనుపమ చేతిలో మంత్రి సెక్స్ టేప్?

Posted: 06/09/2016 05:41 PM IST
Minister parameshwara naik sex tape at anupama shenoy

అనుపమ షెనాయ్ కర్ణాటకలోని కుదిల్గి డీఎస్పీ పదవికి రాజీనామా చేసి 5 రోజులు అజ్నాతవాసంలోకి వెళ్లిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఆమె రాజీనామా చేసిందని, ఓ మంత్రి ఆమె అదృశ్యం వెనుక ఉన్నాడని కర్ణాటక మీడియా కోడై కూసింది. అయితే వాటన్నింటిని ఖండిస్తూ ఆమె గురువారం మీడియా ముందు ప్రత్యక్షమైంది. అయితే అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ తనను బెదిరించాడని, ఆ ఆడియో టేప్ తన వద్ద ఉందని ఆమె మీడియాతో చెప్పారు. అంతేకాదు మంత్రిగారి రాసలీలలకు సంబంధించిన వీడియో కూడా తన దగ్గర ఉందని ఆమె బాంబు పేల్చారు. గతంలో ఆ మంత్రిగారికి ఓ లవ్ అఫైర్ ఉంది. ఆ సమయంలో బరి తెగించి ఆయన వీడియోలు తీసుకున్నారు. అవి నా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటన్నింటిని బయటపెడ్తా అని ఆమె తెలిపారు. తాను రాజీనామాకు కారణాలంటూ ఈనెల 4వ తేదీన ఆమె ఫేస్‌బుక్ పేజీలో పోస్టులు వెలిశాయి. సంచలనం వ్యాప్తంగా మారిన ఈ పోస్టులతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే తనకు అసలు ఫేస్‌బుక్ అకౌంటే లేదని అనుపమా షెనాయ్ చెబుతోంది.

రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లులేవని, కొందరు వ్యక్తులు తన రాజీనామాను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారని ఆరోపించింది. కాగా, గరువారం తన సోదరుడు అచ్యుత్ షెనాయ్‌తో కలిసి పోలీసు క్వార్టర్స్‌కు చేరుకున్న ఆమె అధికారులతో చర్చించకుండా నేరుగా తన క్వార్టర్ కి వెళ్లి తలుపులు మూసుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిడి లేదంటూనే, సదరు మంత్రి పదవి నుంచి తప్పుకుంటే రాజీనామా ఉపసంహరించుకుంటానని అనుపమ చెప్పటం విశేషం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles