ప్రెసిడెంట్ తల రేటు తెలిస్తే ఆశ్చర్యపోతారు | Smugglers offer woopy sum for Philippine president head

Smugglers offer woopy sum for philippine president head

Philippine, Rodrigo Duterte head, drug dealers, Bounty Rodrigo Duterte, డ్రగ్స్ వ్యాపారస్థులు, ఫిలిఫ్ఫైన్స్, ప్రెసిడెంట్ తల, డ్రగ్స్ మాఫియా, రోనాల్డ్ డెలా రోసా, latest news, telugu news

Philippine police on Thursday said it discovered offers promising a million dollars to whoever kills the country's President-elect Rodrigo Duterte, who has declared a war on criminals and drug dealers.

ప్రెసిడెంట్ తల రేటు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Posted: 06/09/2016 06:17 PM IST
Smugglers offer woopy sum for philippine president head

నియంతృత్వ పాలనలో విసిగి వేసారిన ప్రజలో లేక వారి తరపున పోరాడే ఉద్యమకారులో ఇలాంటి డిమాండ్ చేసే ఓ అర్థం ఉంటుంది. కానీ, దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యపై పోరాటానికి సిద్ధపడిన ఆ దేశ అధ్యక్షుడి తలకు అక్కడ రేటు కట్టేశారు. కరుడు గట్టిన స్మగ్లర్లు ఇలాంటి బంఫరాఫర్లు ప్రకటించడం ఇప్పుడు మనీలాలో కలకలం రేపుతోంది.

ఫిలిప్ఫీన్స్ కు తాజాగా కొత్త అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్ట్‌ ఎన్నికయ్యాడు. అంతకు ముందు ఆయన పోలీస్ అధికారి అయి ఉండటం, దేశ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి ఉండటంతో వచ్చి రాగానే డ్రగ్స్ మాఫియా మీద యుద్ధం ప్రకటించాడు. డ్రగ్ డీలర్లను ఎవరైనా చంపేస్తే వారికి బహుమతులు ఇస్తానని, అది నిర్వహించే వ్యాపారస్థులను మట్టుపెడితే ఏకంగా కోటిన్నర వరకు బహుమతి ఇస్తానంటూ తెలిపాడు. డ్రగ్స్ భూతాన్ని దేశం నుంచి తరిమితేనే మనం బాగుపడతామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

తమపై యుద్ధం ప్రకటించడంతో మండిపోయిన డ్రగ్స్ వ్యాపారులు రివర్స్ లో ఆయననే హతమార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హత్య చేస్తే 5 కోట్ల పెసోలు(మన కరెన్సీ ప్రకారం 18 కోట్లు ) ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చేశారు. ఇంతటితో ఆగక ప్రెసిడెంట్ రోడ్రిగో, కొత్త పోలీస్ బాస్ రోనాల్డ్ డెలా తలలను తెచ్చిస్తే భారీ పారితోషకం ముట్టజెప్తామంటూ రాజధాని మనీలాలోని ప్రధాన రోడ్లపై పోస్టర్లు వేయించారు. ఈ విషయాన్ని రోనాల్డ్ డెలా రోసా మీడియాకు వెల్లడించారు. స్మగ్లర్లు ముందుగా ప్రెసిడెంట్ ప్రకటించినట్లే ముందు కోటిన్నర ప్రకటించారని, ఆపై అది సరిపోదని దాన్ని 18 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippine  Rodrigo Duterte head  drug dealers  Bounty Rodrigo Duterte  

Other Articles