సీఎంను ఏడ్పించిన స్కూల్ స్టూడెంట్ | ninth class student reason for anandiben patel tears

Ninth class student reason for anandiben patel tears

female foeticide, gujarath CM, anandiben patel Ambika Gohel, class IX student, female foeticide gujarath, anandiben patel breakdown tears, ఆనందీబెన్ పటేల్ కంటకన్నీరు, సీఎంను ఏడ్పించేసింది, సీఎం కంటకన్నీరు, ఆనందీబెన్ పటేల్ అంబిక గోహెల్, తాజావార్తలు, జాతీయవార్తలు, తెలుగు వార్తలు, గుజరాత్ రాజకీయాలు, latest news, political news

An emotional speech on female foeticide by Ambika Gohel, a class IX student of Heranj village, situated in Mahudha taluka of Kheda district, left the audience and chief minister Anandiben patel in tears.

సీఎంను ఏడ్పించిన స్కూల్ స్టూడెంట్

Posted: 06/10/2016 03:47 PM IST
Ninth class student reason for anandiben patel tears

మోదీ తర్వాత గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆనందీబెన్ పటేల్ శక్తివంతమైన మహిళా నేతగా ఆ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అభివృద్ధికి పెద్ద పీట వేస్తుండటంతో ఆమె పాలనపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలు సైతం వెనకాడుతున్నాయి. అలాంటిది ఓ స్కూల్ స్టూడెంట్ దెబ్బకు ఆమె విల విల ఏడ్చేశారు.

అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న గుజరాత్ లో భ్రూణ హత్యల విషయంలో కూడా టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో ప్రజల్లో అవగాహన కోసం అక్కడ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖేడా జిల్లా హెరంజీ గ్రామంలో జరిగిన సభకు ఆనందీబెన్ పటేల్ హాజరయ్యారు. సభలో అంబిక గోహెల్ అనే తొమ్మిదవ విద్యార్థిని మాట్లాడేందుకు ముందుకు వచ్చింది.

భ్రూణ హత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లికి రాసినట్లుగా ఓ లేఖను చదివి వినిపించింది ఆ అమ్మాయి. అంతే అక్కడున్న వారంతా ఉద్వేగంతో కన్నీరు పెట్టేసుకున్నారు. ‘‘అమ్మా... నేను ఆడపిల్ల అని తెలియగానే నన్ను గర్భంలోనే చంపేశావ్... తప్పు చేవావమ్మా. ఓ విషయం గుర్తుంచుకో కూతురు లేకుంటే ఇల్లు ఇల్లే కాదు’’ అంటూ ఆ చిన్నారి ప్రసంగించింది. అంతే ఆనందీబెన్ పటేల్ కన్నీటిపర్యంతమవుతూ అంబికను హత్తుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆ బాలికను పొగడ్తలతో ముంచెత్తింది. భ్రూణ హత్యలపై బాలిక మాట్లాడింది ప్రతీ తల్లి గుర్తుంచుకోవాలని, ఈ ఘాతుకాలకు అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చింది. కాగా, గుజరాత్ భ్రూణ హత్యలో ఇండియాలోనే మొదటిస్థానంలో ఉంది. ఏటా అక్కడ దాదాపు 23వేలకు పైగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarath CM  anandiben patel Ambika Gohel  class IX student  female foeticide  

Other Articles