అప్పుడు అత్యాచారం.. ఇప్పుడు 11 హత్యలు | rapist killed victim family in central mexico

Rapist killed victim family in central mexico

central mexico, mexico rapist killed victim family, 11 shotdead in central mexico, rapist killed, తాజా వార్తలు, తెలుగు వార్తలు, మెక్సికో రేప్, మెక్సికో రేపిస్ట్, రేపిస్ట్ 11మంది హత్య, 11 మందిని చంపిన రేపిస్ట్, latest news, telugu news

rapist killed victim family in central mexico. Eleven members of a family were found shot to death in central Mexico, and investigators say a rapist who impregnated one of the victims was probably responsible for the killings. The attacks Thursday night targeted a couple, their children and other relatives in the remote hamlet of San Jose el Mirador in the Puebla state municipality of Coxcatlan

అప్పుడు అత్యాచారం.. ఇప్పుడు 11 హత్యలు

Posted: 06/11/2016 01:36 PM IST
Rapist killed victim family in central mexico

మెక్సికోలో మానవ మృగం రెచ్చిపోయింది. గతంలో ఓ మహిళను కిరాతకంగా రేప్ చేసిన నిందితుడు ఏకంగా ఇప్పడు ఆమె కుటుంబాన్నే పొట్టన బెట్టుకున్నాడు. కేసు పెట్టినందుకు ఆ కిరాతకుడు  ఘాతుకానికి పాల్పడ్డాడు.

సెంట్రల్ మెక్సికో కాక్స్‌కాట్లాన్‌లోని మారుమూల ప్రాంతమైన శాన్‌జోస్ ఎల్‌మిరాడాలో  బాధిత కుటుంబం నివసిస్తోంది. ఒంటరిగా వెళ్తున్న ఆ కుటుంబంలోని యువతిపై ఓ వ్యక్తి రేప్ కి పాల్పడ్డాడు. అనంతరం చిత్రహింసలు పెట్టి తన స్నేహితులతో వారంపాటు ఈ అత్యాచార కాండ కొనసాగించాడు. ఎలాగోలా తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల సాయంతో కేసు పెట్టింది. అప్పట్లో సంచలన సృష్టించిన ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఇది మనసులో పెట్టుకున్న సదరు రేపిస్ట్ తన స్నేహితుడితో కలిసి సాయుధుడిగా మారాడు. గురువారం రాత్రి ఆ ఇంట్లోకి చొరబడి ఏకధాటిగా కాల్పులు జరిపాడు.

మొత్తం 11 మంది అక్కడిక్కడే చనిపోగా వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మరో ఇద్దరు పిల్లల్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు సాక్షులు ప్రభుత్వ రక్షణలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు చెప్పారు. వారు చెబుతున్న కథనాలను బట్టి చంపే ముందు మహిళలపై ఆ ఇద్దరు లైంగికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles