hotel receptionist sexual assult on techie in hyderabad

Rape attempt on software engineer in lb nagar

rape, gangrape, rape attempt, software engineer, rape in lb nagar, rape attempt in lb nagar,rape attempt in hyderabad, rape attempt in sitara hotel, rape against women, harreassment on womwn, violence against women

After observing that a software engineer stays alone in sitara hotel at lb nagar hyderabad, hotel receptionist attempts to rape her.

ఎల్బీనగర్ లో ఘోరం.. ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

Posted: 06/14/2016 09:12 AM IST
Rape attempt on software engineer in lb nagar

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. తమ హోటల్ లో వున్న కస్టమర్ ను ఎలాంటి అసౌకర్యం, అభద్రతా లేకుండా పరిరక్షించాల్సిన హోటల్ సిబ్బందే కంచె చేను మేసిన చందంగా తమ కస్టమర్ పై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ కు ఇటీవలే వచ్చిన ఫూణేకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఓ హోటల్ లో గదిని తీసుకుని అక్కడ తాత్కాలిక బసను ఏర్పాటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్పై నిఘా పెట్టిన అమె ఒంటరిగా వుందని తెలుసుకున్న హోటల్ రిసెప్షనిస్ట్  అర్థరాత్రి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

వివరాల్లోకి వెళ్లితే...పుణెకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సోమవారం హైదరాబాద్కు వచ్చింది. స్థానిక సితార హోటల్లో బస చేసింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రిసెప్షనిస్ట్ శేఖర్ గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో  అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఆ యువతి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  rape attempt  gangrape  pune software engineer  lb nagar  hyderabad  crime  

Other Articles