Rs 251 Freedom 251 smartphone to start deliveries

Freedom 251 deliveries to begin june 28 ringing bells

freedom 251 booking, freedom 251 mobile, freedom 251 booking online, ringing bells,freedom 251, ringing bells issues, ringing bells, freedom mobile, book freedom 251, freedom 251 delivery, freedom 251 cashback, freedom 251 price, freedom 251 specs, smartphones, technology news

Ringing Bells claims to deliver Freedom 251, the Rs 251 smartphone, touted to be the world's cheapest, from June 28: Ringing Bells, a little-known company that ran into controversy after announcing a Rs 251 'smartphone', claimed it will start deliveries of the handset to customers from June 28.

అత్యంత చౌవక ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు.. ఈ నెల నుంచి డెలివరీలు..

Posted: 06/14/2016 05:09 PM IST
Freedom 251 deliveries to begin june 28 ringing bells

యావత్ ప్రపంచంలోనే అతి చౌవకైన స్మార్ట్ పోన్ ఏదో తెలుసా.. మీరు ఊహించింది కరక్టే. అయితే వారు కేవలం ఫోన్లను ఇస్తామని ప్రకటించారే కానీ.. ఫోన్లు విక్రయం చేపట్టలేదుగా.. అంటారా..? ఇక ఆ అనుమానాలకు తావు లేదు. ఎందుకంటే తమ ప్రకటనతోనే సంచలనాలకు తెరలేసిన రూ.251ల ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ ను ఈ నెలాఖరు నుంచి అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. కోట్లామంది ఎగబడి మరీ  తమ పేర్లను నమోదు చేసుకున్న ఈ వివాదాస్పద ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారులున మురిపించేందుకు రడీ అవుతున్నాయి.

ఈ నెలలోనే  ఆయా ఫోన్లను అందించేందుకు  కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ 28వ తేదీ నుంచి  తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని  కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ మరోమారు ప్రకటించి మళ్లీ సంచలనాలకు తెరతీసారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా  రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేల మంది కాష్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తమ సంస్థ తరపున ఫోన్లను అందజేస్తామని చెప్పారు. తమ సంస్థ నిజాయితీని దెబ్బతీసినంత మాత్రన తమకు నష్టం లేదని చెప్పారు.

రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తానని ప్రకటించి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని  ప్రకటించింది. గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ప్రపంచంలోనే అతి చౌకగా ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల విక్రయానికి గత ఫిబ్రవరిలో కంపెనీ ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు ప్రకటన ఇచ్చింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నాని తెలిపింది.

దీంతో ఫోన్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకోవడం, తదనంతర పరిణామాలు వివాదానికి దారి తీశాయి. చివరికి టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఐటి శాఖను కల్పించుకోవాల్సిందిగా కోరారు. రింగింగ్ బెల్స్ సంస్థపై ఐటి దాడులు కూడా జరిగాయి. ఈ సంస్థ యాజమాన్యం తాము అద్దెకు తీసుకున్న భవనానికి కూడా అద్దె కూడా చెల్లించలేదని అనేక కూడా అనేక కథనాలు వచ్చాయి. మరి మరోసారి వివాదానికి తెర తీస్తుందా.. లేక  వినియోగదారులను ఆకట్టుకుని మరో  సంలచనానికి దారితీస్తుందా? అన్నది వేచి చూడాల్సింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing Bells  Ravi Shankar Prasad  Freedom 251  cheapest smart phone deliveries  

Other Articles