Sushma Swaraj’s hilariously honest response on Twitter to a man who wanted his refrigerator fixed

Sushma swaraj tweeted a reply about a faulty refrigerator

sushma swaraj, sushma swaraj twitter, sushma swaraj news, sushma swaraj refrigerator, sushma swaraj funny, sushma swaraj iran, sushma swaraj tweet, foreign affairs minister, tweet reply, refrigerator issue, M venkat

Sushma Swaraj is known for reaching out to people in distress via Twitter. But this was unusually different.

సుష్మాజీ బదులు.. నెట్ జనుల నుంచి ప్రశంసలు..

Posted: 06/15/2016 07:53 AM IST
Sushma swaraj tweeted a reply about a faulty refrigerator

గత కొన్నాళ్లుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒంటికాలి మీద లేచే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సుష్మా స్వరాజ్‌ను మాత్రం ఆమె పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. ట్విట్టర్‌ ద్వారా ఆమెకు ఏమైనా తెలియజేస్తే వెంటనే స్పందించి వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులకు సాయం చేయడం, వాళ్లను తిరిగి స్వదేశానికి రప్పించడం లాంటివి ప్రశంసలు అందుకుంటున్నాయి.

అదే ధైర్యంతో తన సమస్యను కూడా ఆమె పరిష్కరిస్తారని ఓ వ్యక్తి తన సమస్యను ఆమెకు చెప్పాడు. కానీ... అదేంటో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాను కొత్తగా కొన్న ఫ్రిజ్ పనిచేయడం లేదని ఆయన సుష్మా స్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. అతడి పేరు వెంకట్. సుష్మా స్వరాజ్‌తోపాటు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు కూడా ఆయన ట్వీట్ చేశారు. శామ్ సంగ్ కంపెనీ తనకు సరిగా పనిచేయని ఫ్రిజ్ అంటగట్టిందని, అందువల్ల ఈ సమస్యను మీరు పరిష్కరించాలని ఆయన కోరారు.

సుష్మాస్వరాజ్ ఈ ట్వీట్‌ను చదవడమే కాదు.. దానికి స్పందించారు కూడా. నిమిషాల వ్యవధిలోనే సమాధానం కూడా ఇచ్చారు. ఆ సమాధానం చూసినందుకు వెంకట్ అంతగా సంతోషకపడకపోవచ్చు గానీ.. అసలు సమాధానం రావడమే గొప్ప. ''తమ్ముడూ... ఒక ఫ్రిజ్‌కు సంబంధించిన విషయాల్లో నేను నీకు సాయం చేయలేను. ప్రస్తుతం తీవ్రమైన కష్టాల్లో ఉన్న మనుషుల వ్యవహారాలతో నేను బిజీగా ఉన్నాను'' అని ఆమె ట్వీట్ చేశారు. ట్విట్టర్ జనాలు సుష్మా స్వరాజ్ సమాధానాన్ని మెచ్చుకున్నారు. సుమారు 6,600 మంది దాన్ని రీట్వీట్ చేయగా, 7,100 మంది దాన్ని లైక్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : foreign affairs minister  sushma swaraj  tweet reply  refrigerator issue  M venkat  

Other Articles